Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 14 2014 @ 03:50AM

నేడు జిల్లాకు రానున్న జేపీ

గుంటూరు(సంగడిగుంట): రాష్ట్ర విభజన జరిగిన అనంతరం తొలిసారిగా లోక్‌సత్తా పార్టీ జాతీయ అధ్యక్షుడు డాక్టర్‌ జయప్రకాష్‌ నారాయణ ఆదివారం గుంటూరులోని రాష్ట్ర పార్టీ కార్యాలయంలో జరిగే కార్యకర్తల సమావేశంలో పాల్గొననున్నారు. సమావేశంలో గత ఎన్నికల్లో వచ్చిన ఫలితాలపై విశ్లేషిస్తారని, అనంతరం కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేసి ఆంధ్రప్రదేశ్‌లో మారిన రాజకీయ పరిస్థితులపై అవగాహన కల్పిస్తారని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అల్లు రమేష్‌రెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమంలో జాతీయ సభ్యులు కఠారి శ్రీనివాసరావు, రాష్ట్ర అధ్యక్షులు డీవీవీఎస్‌ వర్మ పాల్గొంటారన్నారు. అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు విజయవాడకు బయలుదేరి వెళ్తారని తెలిపారు.
గుంటూరు నుంచే పోటీ ?
వచ్చే సాధారణ ఎన్నికల నాటికి జయప్రకాష్‌ నారాయణ ఆంధ్రప్రదేశ్‌ నుండే పోటీ చేయాలని భావిస్తున్నట్లు తెలిసింది. అయితే ఈ విషయంపై ఆ పార్టీ నాయకులు బహిరంగంగా స్పందించడంలేదు. గుంటూరు తూర్పు నియోజక వర్గం నుంచి పోటీచేయడానికి అనుకూల, అననకూల పరిస్థితులపై స్థానిక నాయకులతో ఆయన చర్చించినట్లు తెలిసిది.. గత ఎన్నికల్లో తెలంగాణాలోని మల్కాజ్‌గిరి పార్లమెంట్‌ స్థానం నుంచి పోటీ చేసి ఓటమి పాలైన సంగతి తెలిసిందే. గుంటూరులో విద్యాభ్యాసం చేయడం, స్థానిక రాష్టానికి చెందడం ఆయనకు కలిసి వచ్చే అవకాశాలు ఉండడంతో ఈ నిర్ణయానికి వచ్చి ఉండొచ్చని అనుకోవచ్చు.