Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 14 2014 @ 03:50AM

తెలుగువారి తొలి రాజధాని..అమరావతి

అమరావతి: క్రీస్తు పూర్వం నుంచి బౌద్ధ, శైవారామాలుగా విరాజిల్లిన నేటి అమరావతి తెలుగువారి తొలి రాజధాని. శాతవాహనుల కాలంలో ధాన్యకటకం అనే పేరుతో నేటి అమరావతి విరాజిల్లింది. నేటి ధరణికోట రెండు గ్రామాలు కాలగమనంలో తమకున్న చారిత్రక ప్రాధాన్యతను కోల్పోయాయి. విజయవాడ కేంద్రంగా నవ్యాంధ్ర రాజధాని నిర్మాణం జరుగుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రకటనతో అమరావతి పూర్వ వైభవం సంతరించుకుంటుందని ఆ ప్రాంత ప్రజలు ఆశల్లో ఉన్నారు.
క్రీ.శ. 174-203 వరకు శాతవాహన చక్రవర్తులలో చివరి రాజు అయిన గౌతమీపుత్ర శాతకర్ణి ధాన్యకటకమును రాజధానిగా చేసుకుని పరిపాలన సాగించాడు. పశ్చిమమున కొంకణము నుంచి గుజరాత్‌ వరకు, ఉత్తరమున సాంచీ నుంచి తూర్పున కళింగము వరకు ఆంధ్రరాజ్యమును విస్తరింప జేశాడు. ఆ కాలంలోనే ఆచార్య నాగార్జునుని ఆచార్యునిగా ఆదరించి ఆయనకు శ్రీపర్వతముపై బౌద్ధ ఆరామం కట్టించాడు. ఆయన నుంచి సుహృల్లేఖ, రత్నావళీ అను ధర్మలేఖా గ్రంథాలను గౌతమీపుత్ర శాతకర్ణి స్వీకరించాడు.
తదనంతరం 1761-1816 అచ్చంపేట పరిఽధిలోని చింతపల్లి ప్రాంతానికి చెందిన శ్రీ రాజావాసిరెడ్డి వెంకటాద్రినాయుడు బహద్దూర్‌ అమరావతిని రాజధానిగా చేసుకుని పరిపాలన సాగించాడు. రాజావాసిరెడ్డి తన హయాంలో అనేక పట్టణాలు, గ్రామాలను నిర్మించారు. అంతేకాక 108 దేవాలయాల వ్యవస్థాపక రాజపోషకుడిగా, అసంఖ్యాక దేవాలయ సముద్ధారకుడుగా పేరుగాంచాడు. రాజమండ్రి, నందిగామ,గుంటూరు పరగణాలలో 552 గ్రామాల పాలకుడుగా పేరొందాడు. చేబ్రోలు బ్రహ్మాలయం, మంగళగిరి నృసింహస్వామి ఆలయ గాలిగోపురాలను నిర్మించాడు. ఆంగ్ల, ఫ్రెంచి పాలకులకు సింహ స్వప్నంగా సంస్కృతాంధ్ర, ఆరబ్బీ భాషా పండితుడిగా గుర్తింపు పొందాడు. ధాన్యకటకం, అమరావతిని రాజధానిగా చేసుకుని పాలించిన గౌతమీపుత్ర శాతకర్ణి, వెంకటాద్రినాయుడులు చారిత్రక ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకుని అమరావతి, ధరణికోట గ్రామాలలో వారి విగ్రహాలను ఏర్పాటు చేశారు. అంతేకాకుండా ధాన్యకటక బుద ్ధవిహార ట్రస్టు, అమరేశ్వరాలయాలకు వంశపారంపర్య ధర్మకర్తలుగా ఏర్పాటు చేశారు.

ఠీంనీ్‌్జ