desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 14 2014 @ 03:50AM

పేరులోనే ‘ప్రథమం’

గుంటూరు, ఆంధ్రజ్యోతి: రాజకీయ పార్టీలు ఎన్నికలకు ముందు స్థానిక సంస్థలకే అధికారాలు, నిధులు, విధులు అని వాగ్దానాలు కురిపిస్తుంటాయి. కాని అధికారం చేపట్టిన తర్వాత పంచాయతీల అధికారాలను ఏ విధంగా జేజిక్కుంచుకోవాలనే అంశంపై దృష్టి సారిస్తున్నారు. సుమారు 2 లక్షల మంది ఓటర్లకు ప్రతినిధిని.... 2వేల ఓటర్లు ఎన్నుకున్న సర్పంచ్‌ నాకు అడ్డుచెప్తున్నాడంటూ ఎమ్మెల్యే ఇబ్బందులకు గురిచేయడం ఆనవాయితీగా వస్తోంది. ఏడాదిన్నర క్రితం పంచాయతి ఎన్నికలు జరిగాయి. ప్రస్తుతం కొత్త ప్రభుత్వం వచ్చింది. ఈ నేపథ్యంలో అధికార పార్టీకి చెందిన సర్పంచ్‌లు అసోసియేషన్‌ కార్యకలాపాలను వేగవంతం చేశారు.
సర్పంచ్‌ ఆధ్వర్యంలో
జరగాల్సిన కార్యక్రమాలు
ఫ గ్రామంలో అక్షరాస్యతను పెంచడానికి సర్పంచ్‌ అధ్యక్షతన కమిటీ ఉంటుంది. ఈ కమిటీ దశల వారీగా అందరికీ సంతకం, దినపత్రికలు చదివే వరకు అక్షరాలను నేర్పాలి.
ఫ గ్రామ స్థాయిలో జనాభా నియంత్రణ కమిటీ సర్పంచ్‌ అధ్యక్షతన సమావేశం కావాలి. వైద్య, ఆరోగ్య శాఖ సిబ్బంది గ్రామంలో ఎవరున్నారో తెలియని పరిస్థితి ఉంది.
ఫ గ్రామంలో సాగునీరు అందించడానికి గ్రామ స్థాయి పంటల స్థిరీకరణ కమిటీ ఉంటుంది. ఈ కమిటీ చివరి భూములకు సాగు నీరు అందించడానికి కృషి చేయాలి. సర్పంచ్‌ అధ్యక్షతన పైభూముల రైతులు కాలువలకు గండ్లుపెట్టి చివరి భూములకు నీరు రాకుండా ఆటంకాలు కల్పిస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి సర్పంచ్‌ అధ్యక్షతన కమిటీ సమావేశం కావాలి.
ఫ గ్రామంలో పోరంబోకు, ప్రభుత్వ భూములను కాపాడాల్సింది సర్పంచ్‌లే. గ్రామాల్లో ల్యాండ్‌ బ్యాంకులు ఏర్పాటు చేసి ఈ భూములను ప్రభుత్వ కార్యక్రమాలకు ఉపయోగించే విధంగా చర్యలు తీసుకోవాలి.
ఫ గ్రామ స్థాయిలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలన్నా అసైన్డ్‌ కమిటీకి సర్పంచ్‌ అధ్యక్షత వహించాలి. అసైన్డ్‌ కమిటీ ఆమోదిస్తేనే ప్రభుత్వం ఇళ్ల పట్టాలివ్వాలి.
ఫ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పేదలకు మెరుగైన జీవనోపాధి కల్పించడానికి ప్రతి ఏడాది సబ్సిడీ రుణాలిస్తారు. సబ్సిడీ రుణాల లబ్ధిదారులను ఎంపిక చేయడానికి ప్రభుత్వం, బ్యాంకర్లు క్రెటిట్‌ క్యాంపులను జరుపుతారు. ఆయా గ్రామాల్లో సర్పంచ్‌ల అధ్యక్షతన పంచాయతి కార్యాలయాల్లో ఈ క్యాంపులు జరగాలి. ప్రస్తుతం క్యాంపులకు సర్పంచ్‌లనే పిలవడంలేదు.
ఫ గ్రామంలో అంటరానితనం, అస్పృశ్యత, రెండు గ్లాసుల విధానాన్ని నిర్మూలించడానికి సర్పంచ్‌ అధ ్యక్షతన రెవెన్యూ అధికారులు అప్పుడప్పుడు సమావేశం జరపాలి. ఇది ఎక్కడా అమలు కావడంలేదు.
ఫ ఆరేళ్లు దాటిన పిల్లలకు నిర్బంధ ఉచిత విద్యను అమలు చేయాలి. పిల్లలు పాఠశాలలకు పంపాల్సిన బాధ్యత సర్పంచ్‌ అధ్యక్షతన ఉన్న కమిటీదే. విద్యా కమిటీ సర్పంచ్‌ అధ్యక్షతన ఏర్పడాలి.
ఫ అంగన్‌వాడీ కేంద్రాల పనితీరును సర్పంచ్‌ అధ్యక్షతన మహిళా శిశుసంక్షేమ శాఖ అధికారులు సమీక్షించాలి. ఇది ఎక్కడా అమలు జరగడం లేదు.
ఫ బాల కార్మికులను గుర్తించి వారిని బడికి పంపే బాధ్యత సర్పంచ్‌ అధ్యక్షతన ఉండే కమిటీయే చూడాలి. ఈ కమిటీకి సర్పంచ్‌ చైర్మన్‌గా ఉంటారు.
ఫ గ్రామంలో జరిగే ప్రభుత్వ కార్యక్రమాలు సర్పంచ్‌ నాయకత్వంలో ఏర్పాటు చేయాలి. ప్రొటోకాల్‌ నిబంధనల మేరకు శిలాఫలకాలపై సర్పంచ్‌ పేరుండాలి. ప్రస్తుతం సర్పంచ్‌ ప్రతిపక్ష పార్టీకి చెందినవారైతే వారికి చెప్పకుండానే అధికార పార్టీ కార్యక్రమాలను నిర్వహిస్తోంది.
ఫ పర్యావరణాన్ని ప్రోత్సహించడానికి మొక్కలు నాటే ప్రక్రియను సర్పంచ్‌ ఆధ్వర్యంలోనే చేపట్టాలి. నూటికి నూరు శాతం పారిశుద్ధ్యం, ఇంటింటికి మరుగుదొడ్డి వంటి కార్యక్రమాలను సర్పంచ్‌ ఆధ్వర్యంలోనే నిర్వహించాలి.
ఫ పంచాయతి కార్యాలయం వద్ద ఆగస్టు 15, జనవరి 26, రాష్ట్ర అవ తరణ దినోత్సవం వంటి జాతీయ, రాష్ట్ర పండుగల సందర్భాల్లో సర్పంచ్‌ జాతీయ జెండాను ఎగురవేయాలి. సర్పంచ్‌ బీసీ, ఎస్సీ, ఎస్టీలకు చెందినవారైతే అటువంటి చోట ప్రస్తుతం ఉప సర్పంచ్‌లు జెండాలు ఎగుర వేస్తున్నారు.
ఫ గ్రామంలో వాతావరణ కాలుష్యాన్ని నివారించడానికి సర్పంచ్‌ అధ్యక్షతన ఉన్న కమిటీ అన్ని బాధ్యతలు తీసుకోవాలి.
ఫ గ్రామంలో ఇల్లు కట్టుకోవాలన్నా, ఏదైనా పరిశ్రమ పెట్టాలన్నా పంచాయతి తీర్మానం ఉండాలి. ప్రస్తుతం ఇటువంటి విధానాలు ఎక్కడా అమలులో లేవు.
ఫ గ్రామంలో తాగునీరు, శ్మశానవాటిక సౌకర్యాలను సర్పంచ్‌లు కల్పించాలి.
ఫ గ్రామంలోని పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయుల పనితీరును సర్పంచ్‌ పరిశీలించే అధికారం ఉంది. పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసి ప్రభుత్వానికి సర్పంచ్‌ నివేదిక ఇచ్చే అవకాశం ఉంది. దీనిని ఎవరూ ఉపయోగించుకోవడంలేదు.
నిధులులేక కునారిల్లుతున్న
పంచాయతీలు
ప్రస్తుతం గ్రామాలు నిధులు లేక కునారిల్లుతున్నాయి. స్థానికంగా వనరులను సృష్టించుకుని ఆదాయాన్ని పెంచుకోవాలి. ఆ దిశగా ప్రభుత్వాలు ప్రోత్సహించడం లేదు. పంచాయతీలు పూర్తిగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ నిధులపైనే ఆధార పడ్డాయి. చిన్న పంచాయతీలు విద్యుత్‌ బిల్లులు కూడా చెల్లించలేక పోతున్నాయి. మేజర్‌ పంచాయతీల్లో ఆదాయాన్ని దృష్టిలో ఉంచుకుని సిబ్బందిని నియమిస్తున్నారు. గ్రామాల్లో వెయ్యిలోపు ఓటర్లున్న పంచాయతీల్లో సిబ్బంది జీతాలు కూడా చెల్లించలేక పోతున్నారు.
సకాలంలో జమకాని
సర్‌చార్జి, మైనింగ్‌ నిధులు
పంచాయతీలకు రిజిస్ర్టార్‌ కార్యాలయం ద్వారా వచ్చే సర్‌చార్జి నిధులు సకాలంలో జమకావడంలేదు. ట్రెజరీ కార్యాలయాలకు సబ్‌ రిజిస్ర్టార్‌ ఆఫీసుల నుంచే నిధులు విడుదల చేయడంలేదు. ఆయా గ్రామాల సర్పంచ్‌లు నేరుగా సబ్‌ రిజిసా్ట్రర్‌ కార్యాలకు వెళ్లి అక్కడ ప్రసాదం పెడితేనే డబ్బు ట్రెజరీ కార్యాలయానికి చేరుతుందనే ఆరోపణలున్నాయి. జిల్లాలో ప్రస్తుతం సుమారు రూ. వంద కోట్ల వరకు పంచాయతీలకు సర్‌చార్జి నిధులు జమకాలేదు. అదేవిధంగా మైనింగ్‌ నిధులు కూడా సక్రమంగా జమచేయడంలేదు. ఇసుక క్వారీలు, కొండలున్న ప్రాంతాల్లో పంచాయతి, మండల పరిషత్‌లకు జడ్పీ నుంచి నిధులివ్వాలి. జిల్లాలో కొల్లూరు, తాడేపల్లి, భట్టిప్రోలు, అచ్చంపేట, అమరావతి మండలాల్లో పంచాయతీలు, మండల పరిషత్‌లకు మైనింగ్‌ నిధులు ఏళ్ల తరబడి జమ చేయడంలే దు.
ఎవరు అధికారంలో ఉన్నా.....
రాష్ట్రంలో ఎవరు అధికారంలో ఉన్నా స్థానిక సంస్థలపై పెత్తనం చెలాయిండం ఆనవాయితీగా వస్తోంది. ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు క్షేత్ర స్థాయిలోని సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, ఎంపీపీలను ప్రజా ప్రతినిధులుగా గుర్తించడంలేదు. గ్రామాల్లో ప్రతిపక్ష సర్పంచ్‌లుంటే సమాచారం ఇవ్వకుండా కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నారు. ప్రొటోకాల్‌ ఉల్లంఘించారని పదేపదే ఫిర్యాదు చేస్తున్నా పట్టించుకునే వారు లేరు.
సర్పంచ్‌ నుంచే ఉన్నత స్థాయికి..
జిల్లాలో ధూళిపాళ్ల వీరయ్య చౌదరి చింతలపూడి సర్పంచ్‌గా ఎన్నికై రాష్ట్ర రెవెన్యూ మంత్రి స్థాయికి ఎదిగారు. ప్రస్తుత డీసీసీ అధ్యక్షుడు మక్కెన మల్లికార్జునరావుతో పాటు దేవినేని మల్లికార్జునరావు, జంగా కృష్ణమూర్తి, చీరాల గోవర్ధనరెడ్డి, జూలకంటి నాగిరెడ్డి, గణపా రామస్వామిరెడ్డి, దొడ్డా బాలకోటిరెడ్డి, పుతుంబాక వెంకటపతి, సోమేపల్లి సాంబయ్య, చల్లా నారపరెడ్డి, మందపాటి నాగిరెడ్డి తదితరులు ఆయా గ్రామాల సర్పంచ్‌లుగా పనిచేసి ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. అదేవిధంగా డీసీసీబీ మాజీ చైర్మన్‌ నల్లపాటి శివరామ చంద్రశేఖరరావు కూడా సర్పంచ్‌గా పని చేశారు. ఈ విధంగా అనేక మంది నేతలు క్షేత్ర స్థాయిలో సర్పంచ్‌గా పనిచేసిన వారే.
నేడు గుంటూరులో రాష్ట్ర స్థాయి సదస్సు....
రాష్ట్ర విభజన తరువాత 13 జిల్లాల నవ్యాంధ్రలో వివిధ గ్రామాల సర్పంచ్‌లు ఆదివారం గుంటూరులో సమావేశమవుతున్నారు. తమకు 73వ రాజ్యాంగ సవరణ ద్వారా వచ్చిన విధులు, నిధులు, అధికారాలను బదలాయించాలని వీరు డిమాండ్‌ చేస్తున్నారు. జిల్లా సర్పంచ్‌ల సంఘ అద్యక్షుడు కే మధుసూదనరావు ఆధ్వర్యంలో ఈ సమావేశం జరగనున్నది. పంచాయతిరాజ్‌ మంత్రి అయ్యన్న పాత్రుడు, జిల్లా మంత్రులు పుల్లారావు, కిషోర్‌బాబు, టీడీపీ జిల్లా ఇన్‌చార్జి గరికపాటి మోహనరావు, జడ్పీ చైర్‌పర్సన్‌ జానీమూన్‌, ఎమ్మెల్యేలు, ఎంపీలు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు.7క్షనీలి్ఖౌ