Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 14 2014 @ 03:49AM

కార్మిక సంక్షేమం పట్టని ప్రభుత్వాలు

గుంటూరు(సంగడిగుంట): ప్రభుత్వాలకు కార్మికుల సంక్షేమం పట్టడం లేదని, పెట్టుబడిదారుల లబ్ధికోసం కార్మిక చట్టాలను కూడా మారుస్తున్నారని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంఏ గఫూర్‌ అన్నారు. జిల్లా ిసీఐటీయూ 7వ మహాసభలు శనివారం గుంటూరులో ప్రారంభమయ్యాయి. కార్యక్రమంలో ముఖ్య అతిఽథిగా పాల్గొన్న గఫూర్‌ మాట్లాడుతూ గుంటూరు నగరం కార్మిక ఉద్యమాలకు కేంద్రమన్నారు. కార్మిక చట్టాలు నీరు కారిపోతున్నందున జరగబోయే ఉద్యమాలకు గుంటూరు దిక్సూచిగా ఉండాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి రాజధాని తప్ప మరో విషయం పట్టడం లేదని విమర్శించారు. విశాఖపట్నంలో జరిగిన తొలి క్యాబినెట్‌ సమావేశంలోనే పదివేల మంది ఫీల్డ్‌ అసిస్టెంట్లను తొలగించటం దారుణమన్నారు. అంగన్‌వాడీ టీచర్లను తొలగించాలంటూ అధికారులపై ఒత్తిడి తెస్తున్నారన్నారు. రాజకీయ వేధింపులకు వ్యతిరేకంగా కార్మిక హక్కుల రక్షణ కోసం ఈ మహాసభల్లో పలు తీర్మానాలు చేస్తామన్నారు. ఎమ్మెల్సీ లక్ష్మణరావు మాట్లాడుతూ సీఐటీయూ చేపట్టే ప్రతి కార్యక్రమానికి శాసన మండలిలో గల ఆరుగురు పీడీఎఫ్‌ ఎమ్మెల్యేల పూర్తి మద్దతు ఉంటుందన్నారు. సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆర్‌ లక్ష్మయ్య, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పాశం రామారావు ప్రసంగించారు.
నగరంలో భారీ ర్యాలీ
పదండి ముందుకు... పదండి తోసుకు అంటూ సీఐటీయూ కార్మికులు నగరంలో కదం తొక్కారు. బీఆర్‌ స్టేడియం నుంచి మహిమా గార్డెన్స్‌ వరకు జరిగిన ర్యాలీలో వేలాది మంది కార్మికులు పాల్గొన్నారు. పలు కార్మిక సంఘాల వీరికి పూల వర్షంతో ఘనంగా స్వాగతం పలికాయి. కార్యక్రమంలో అప్పా రావు, నాగబ్రహ్మాచారి, వై నేతాజీ తదితరులు పాల్గొన్నారు.