desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 14 2014 @ 03:42AM

రోడ్లపై తిరిగే పశువులు బందెల దొడ్డికి తరలింపు

మచిలీపట్నం-ఈడేపల్లి: రోడ్లపై పశువులను వదిలిపెడితే పశువులను బందెల దొడ్డికి పంపుతామని మునిసిపల్‌ చైర్మన్‌ మోటమర్రి బాబాప్రసాద్‌ హెచ్చరించారు. మునిసిపల్‌ చైర్మన్‌ చాంబర్‌లో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ, రోడ్లపై పశువులు తిరుగుతున్నందున ప్రమాదాలు జరుగుతున్నాయని, ఈ ప్రమాదాల్లో చాలా మంది వికలాంగులవుతున్నారన్నారు. రాత్రి సమయంలో పశువులను ఢీకొని ద్విచక్ర వాహనాలపై వెళ్ళే వారు ప్రమాదాలపాలవుతున్నారని, వీటిని దృష్టిలో ఉంచుకుని పశువుల యజమానులు సహకరించాలన్నారు. మునిసిపల్‌ కమిషనర్‌ మారుతీదివాకర్‌ మాట్లాడుతూ, వారం రోజుల తరువాత రోడ్లపై పశువులను వదిలితే బందెల దొడ్డికి తోలి వెయ్యి రూపాయల జరిమానా విధిస్తామన్నారు. గేదెలు, ఆవులు, పందులు, మేకలను రోడ్లపై యథేచ్ఛగా వదులుతున్నారని, వీటి వల్ల పలు ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. వైస్‌ చైర్మన్‌ పంచపర్వాల కాశీవిశ్వనాధం మాట్లాడుతూ, శిఽథిలమైన డంపర్‌ బిన్లకు మళ్ళీ పాటలు నిర్వహిస్తామన్నారు.