Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 14 2014 @ 03:42AM

‘బెల్‌’ను తరలిస్తే ఉద్యమిస్తాం

మచిలీపట్నం-ఈడేపల్లి: ప్రతిష్ఠాత్మకమైన మచిలీపట్నం బెల్‌ విస్తరణను నిభానుపూడికో, గన్నవరానికో తరలిస్తే ఉద్యమిస్తామని సీపీఎం నాయకుడు కొడాలి శర్మ పేర్కొన్నారు. స్థానిక సీపీఎం కార్యాలయంలో శనివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గో సంఘంలో పేదలకు నివేశన స్థలాలుగా ఇచ్చిన స్థలాన్ని సైతం బెల్‌ విస్తరణకు ఇచ్చేందుకు అంగీకరించామన్నారు. రూ.150 కోట్లతో మచిలీపట్నంలో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ నిర్మాణం జరిగితే నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. విస్తరణ తరలిపోకుండా మంత్రి, ఎంపీ చొరవ తీసుకోవాలన్నారు. ఎస్‌.మూర్తిరాజు మాట్లాడుతూ, బందరు మండలంలో వందలాది ఎకరాల ప్రభుత్వ భూమి ఉందని, ఎక్కడో ఒకచోట బెల్‌ విస్తరణకు కావాల్సిన భూమిని ఇచ్చేందుకు అవకాశాలున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో బి.సుబ్రహ్మణ్యం, జయరాజు, రమణరావు తదితరులు మాట్లాడారు.