Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 14 2014 @ 03:42AM

సాగునీరందక రైతుల అవస్థలు

మోపిదేవి : మండలంలోని పెదకళ్లేపల్లి, ఉత్తర చిరువోలులంక, కోసూరువారిపాలెంలో సాగునీరందక రైతులు నానా అవస్థలు పడుతున్నారు. వరుణుడు కరుణించక, కాలువకు పూర్తిస్థాయిలో నీరు రాకపోవటంతో పొలాలు బీడులుగా మారుతున్నాయి. ప్రధాన సాగునీటి కాలువలైన 11,12 నెంబరు కాలువలకు పూర్తిస్థాయిలో నీటిని విడుదల చేయకపోవటంతో ఆయా గ్రామాల కాలువ చివరి ప్రాంతాలైన్నందున అరకొరగానే నీరు వస్తుందని రైతులు చెబుతున్నారు. కాలువ చివరి ప్రాంతాలలో దట్టంగా జున్నుగడ్డి, తూటుకాడ అలుముకోవటంతో అంతంత మాత్రంగా వస్తున్న నీరు కూడా చివరి భూముల వరకు రావటం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెదకళ్లేపల్లి పరిధిలోని వందల ఎకరాలు నేటికీ నాట్లు వేసేందుకు అవకాశం లేకుండా ఉన్నాయి. మేళ్ళమర్రు, అయోధ్యలతోపాటు పలు శివారు ప్రాంతాలలో సాగు ప్రశ్నార్థకంగా మారింది. కాలువలకు వస్తున్న అరకొర నీటితో ఆయిల్‌ ఇంజన్ల ద్వారా సాగు చేపట్టేందుకు పలువురు సాహసం చేస్తున్నామని, రాబోయే కాలంలోనైనా కాలువలకు నీటిని పూర్తిస్థాయిలో అందించాల్సిందిగా రైతులు కోరుతున్నారు.