Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 14 2014 @ 03:32AM

అర్ధాకలితో చదవలేకపోతున్నాం

తిరువూరు: చాలీచాలని అన్నంతో అర్ధాకలితో చదువులు సాగించలేకపోతున్నామని సాంఘిక సంక్షేమ వసతి గృహంలోని కళాశాల విద్యార్థినులు కన్నీటి పర్యంతమయ్యారు, హాస్టల్‌లో సౌకర్యాలు కల్పించాలని కోరుతూ శుక్రవారం ఆందోళన ప్రారంభించిన వారు శనివారం కూడా కొనసాగించారు. ఉదయం నుంచి ఏమీ తినకుండా ఎండలో హాస్టల్‌ ఆవరణలో ధర్నా చేశారు. హాస్టల్‌లో మెనూ అమలు చేయటం లేదని తాగునీరు సక్రమంగా అం ద టం లేదని తాము రాత్రి వేళలో కూడా బయటకు వెళ్ళి తాగునీరు తెచ్చుకోవల్సి వస్తోందని వారు అవేదన వ్యక్తంచేశారు మరుగుదొడ్లు సక్రమంగా లేవని తెలిపారు, తహసీల్దార్‌ బాలకృష్ణారెడ్డి ఉదయం నుంచి హాస్టల్‌లో ఉం డి విద్యార్థినుల సమస్యలు తెలుసుకున్నారు, వసతి గృహః పరిసర ప్రాంతాలు పరిశీలించారు, ఉదయం అల్పాహారంగా అందించిన కిచిడి మాడి ఉండటం గమనించారు, హాస్టల్‌ మెనూ రోజు వారి విద్యార్థినులకు అందిస్తున్న ఆహారం తదితర వివరాలను వార్డెన్‌ను, వంట తయారీదారుల్ని అడిగి తెలుసుకున్నారు, విద్యార్ధులు తెలిపిన వివరాలు రాసుకున్నారు. ఉన్నతాధికారులకు నివేదిక పంపుతామన్నారు, డీడీ వచ్చేవరకూ తాము అందోళన విరమించమని విద్యార్థినులు తెలిపారు.
హాస్టల్‌ నిర్వహణ తీరుపై డీడీ అసంతృప్తి
వసతి గృహంలో విద్యార్థులకు ఖర్చు చేసే ప్రతీ రూపాయి ప్రభుత్వం ఇస్తోంది మనం ఒక్క రూపాయి సొంత నిధులు ఇవ్వటం లేదు ఎందుకు మీరు సక్రమంగా హాస్టల్‌ నిర్వహించరని’ సాంఘిక సంక్షేమశాఖ డీడీ మధుసూదరావు సాంఘిక సంక్షేమ వసతి గృహ అధికారుల్ని ప్రశ్నించారు విద్యార్థినుల ఆందోళనకు గల కారణాలను తెలుసుకోడానికి ఆయన శనివారం హాస్ఠల్‌ను సందర్శించారు తమకు సరిగా భోజనం పెట్టడంలేదని విద్యార్థినులు డీడీకి చెప్పారు.సమస్యలు ఇప్పటి వరకు తన దృష్టికి ఎందుకు తే లేదని సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తంచేశారు, ఏఎస్‌డబ్లువో, హాస్టల్‌ వార్డెన్‌లు ఒకరికొకరు పొంతన లేని సమాధానాలుచెప్పడంతో డీడీ అసంతృప్తి వ్యక్తంచేశారు. హాస్టల్‌ ట్యాంక్‌ బీటలు వారి నీరు వృఽథాగా పోతోందని దాని వల్ల నీళ్లు ఉండటం లేదని ఈ సమస్యగా ఏడాదిగా ఉన్నా పరిష్కరించలేదని విద్యార్థినులు చెప్పారు ఈ విషయంపై డీడీ స్పందిస్తు, మీ ఇంట్లో ఇలాగే వదిలి వేస్తారా హాస్టల్‌ విద్యుత్‌ బిల్లు రూ25 వేలు బిల్లు ఎందుకు వస్తోంది. బాధ్యతగా వ్యవహరించరా అని ఆగ్రహం వ్యక్తం చేశారు, విద్యార్థినులు తెలిపిన సమస్యలు పరిష్కరించి తిరిగి అవి పునరావృత్తం కాకుండా చూస్తాననీ హామీ ఇచ్చారు, ఏఎస్‌డబ్ల్లువో, వార్డెన్‌లపై శాఖాపర చర్యలు తీసుకుంటామని తెలిపారు, హాస్టల్‌లో వంట నిర్వాహకుల్ని.నైట్‌ వాచ్‌మన్‌ను విధుల నుంచి తప్పించారు,

ంనీగిఅ్జ7