Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 14 2014 @ 03:32AM

మునిసిపల్‌ ఉద్యోగుల సస్పెన్షన్ల పర్వం

మచిలీపట్నం-ఈడేపల్లి: అక్రమాలకు పాల్పడుతున్న మునిసిపల్‌ ఉద్యోగులపై వరుసగా సస్పెన్షన్ల వేట్లు పడుతున్నాయి. ఇప్పటికే ఇంజనీరింగ్‌, హెల్త్‌ శాఖలకు చెందిన ఇద్దరు ఉద్యోగులు సస్పెండ్‌ కాగా టౌన్‌ప్లానింగ్‌ శాఖకు చెందిన మరో ఇద్దరు ఉద్యోగులు సస్పెన్షన్‌కు గురవుతున్నట్టు తెలిసింది. లంచాల కోసం ఫైళ్ళు మాయం చేయడానికి ఉద్యోగులు అలవాటు పడ్డారు. ఇంజనీరింగ్‌ సెక్షన్‌కు చెందిన నవప్రకాష్‌ టెండర్ల ఫైలు విషయంలో అలసత్వం చూపి సస్పెండ్‌ అయ్యాడు. తాజాగా క్లోరినేషన్‌కు చెందిన ఫైలును మాయం చేసిన నిర్మలాదేవిని కమిషనర్‌ సస్పెండ్‌ చేశారు. సస్పెండ్‌ చేసిన అనంతరం ఫైలు కనబడిందంటూ నిర్మలాదేవి తీసుకొచ్చింది. ఈ ఉదంతంపై అసిస్టెంట్‌ కమిషనర్‌ను విచారణాధికారిగా నియమించారు. కాగా పట్టణంలో యథేచ్ఛగా అంతస్తులపై అంతస్తులను అనుమతులు లేకుండా నిర్మిస్తున్నారు. తీసుకునే అనుమతులకు నిర్మాణాలకు పొంతన లేకుండా పోతోంది. బహుళ అంతస్తులు నిర్మిస్తున్నా మునిసిపల్‌ అధికారులు పట్టించుకోవడం లేదు. రైతుబజార్‌, భాస్కరపురం, సుకర్లాబాద్‌, తదితర ప్రాంతాల్లో నిర్మిస్తున్న భవనాలు, అపార్టుమెంట్లు నిబంధనలను పాటించడం లేదు. ఇందుకు బాధ్యులైన టౌన్‌ప్లానింగ్‌ సిబ్బందిని బదిలీ చేసేందుకు ఫైలు కదులుతున్నట్టు తెలిసింది. మునిసిపల్‌ కార్యాలయాన్ని ప్రక్షాళన చేసేందుకు ఉన్నతాధికారులు ఉద్యుక్తులవుతున్నారు.


ుఽ్టహాొుఽభంనీఈిజు