Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 14 2014 @ 03:32AM

ఘనంగా గణనాథుని వసంతోత్సవం, నిమజ్జనం

నాగాయలంక : గత పదిహేను రోజులుగా భక్తులచే విశేష పూజలందుకున్న నాగాయలంకలోని శ్రీ ప్రసన్న గణపతి ఆలయంలో చలువ పందిరిలో ప్రతిష్ఠించిన ఉత్సవ గణనాథునికి వసంతోత్సవం, నిమజ్జనం కార్యక్రమం శనివారం భక్తులు, ప్రజలు కోలాహలాల మధ్య ఘనంగా జరిగింది. ముగింపు కార్యక్రమంలో భాగంగా ఉత్సవ గణనాథుని ప్రత్యేకంగా అలంకరించిన వాహనంలో పురవీధులలో డప్పు కళాకారులు, మేళతాళాల వాయిద్యాల మధ్య చిత్ర విచిత్ర వేషధారణల నడుమ ఊరేగించారు. ఈ కార్యక్రమం మూడు గంటలపాటు నిర్విఘ్నంగా సాగింది. ఈ కార్యక్రమంలో ప్రసన్న గణపతి ఉత ్సవ కమిటీ సభ్యులు మండవ బాలవర్థిరావు, తలశిల వెంకట చిదంబరం, సుకవాసి యుగంధర్‌, లంకే ఆదిశేషారావు, ఎంపీపీ సజ్జా గోపాలకృష్ణ, ఆలూరి శ్రీనివాసరావు, తెలుగు మహిళా జిల్లా ఉపాధ్యక్షురాలు తలశిల స్వర్ణలత, చిట్టా సాంబశివరావు, శివనాగేశ్వరరావులతో వందలాది మంది భక్తులు, ప్రజలు ఆనందోత్సాహాలు మధ్య నాగాయలంకలోని కృష్ణానదిలో గణనాథుని నిమజ్జనం చేశారు.


ుఽఃజుెుఽ ఈ్న్షఖ