Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 14 2014 @ 03:31AM

రూ.3 కోట్లకు చీటీల వ్యాపారి టోకరా

గుణదల: ప్రైవేటు చీటీల నిర్వాహకుడు నిడమానూరు గ్రామస్తులకు రూ.3 కోట్లకు టోకరా వేసి పరారైనట్లు శనివారం వెలుగులోకి వచ్చింది. విజయవాడ రూరల్‌ మండలం నిడమానూరుకు చెందిన బత్తుల కోదండరామయ్య పదేళ్ల నుంచి గ్రామంలో ప్రైవేటు చీటీలు నిర్వహిస్తున్నాడు. రూ.50 వేల నుంచి రూ.5 లక్షల వరకు చీటీలు వేసేవాడు. నిడమానూరులో మూడేళ్ల క్రితం భారీస్థాయిలో ధనలక్ష్మి డైయిరీ ఫారమ్‌ ప్రారంభించాడు. దాని నిర్వహణకు గ్రామంలోని కొంతమంది నుంచి డిపాజిట్‌లు తీసుకున్నాడు. వడ్డీకి ఆశ పడి చాలామంది కోదండరామయ్యకు పెట్టుబడి పెట్టారు. గ్రామస్తుల వద్ద తీసుకున్న డిపాజిట్‌లు చెల్లించకుండానే డైయిరీ ఫారమ్‌ను తీసేశాడు. ఆ తరువాత ఫ్రెష్‌ అండ్‌ ఫ్రెష్‌ పేరుతో బతికున్న చేపలు, రొయ్యలు, కోళ్ళు, మేకలు, గొర్రెల మాంసం ఫ్రెష్‌గా విక్రయించే వ్యాపారాన్ని కూడా ప్రారంభించాడు. ఈ నేపథ్యంలో డైయిరీ ఫారమ్‌ స్థలాన్ని విక్రయించి సొమ్ము చేసుకున్నాడు. చీటీలు వేసిన వారికి సొమ్ము చెల్లించకుండానే అడిగిన వారికి చె క్కులు ఇచ్చి చేతులు దులుపుకున్నాడు. ఆ చెక్కులు బ్యాంకుల్లో బౌన్స్‌ అయ్యాయి. దీంతో చీటీలు వేసిన వారు అనుమానంతో ఒక్కొక్కరుగా నిలదీయడం ప్రారంభించారు. దీంతో గత నెల 20 నుంచి నిర్వాహకుడు కోదండరామయ్య కనబడకుండా పరారీలో ఉన్నాడు. ఇదే విషయాన్ని కోదండరామయ్య కుటుంబ సభ్యులను ప్రశ్నించగా వారు దురుసుగా సమాధానం చెప్పారు. బాధితులు మొత్తం ఒకతాటిపైకి వచ్చేలోపే చీటీల నిర్వాహకుడు పోలీస్‌ కమిషనర్‌ను కలిసి తనకు వ్యాపారంలో నష్టమొచ్చిందని, రూ.90 లక్షలు అప్పులు ఉన్నా యని, తనకు రక్షణ కల్పించాలని కోరినట్లు విశ్వసనీయ సమాచారం.
ఆందోళనకు దిగిన బాధితులు
పరారీలో ఉన్న చీటీల నిర్వాహకుడి ఫ్రెష్‌ అండ్‌ ఫ్రెష్‌ దుకాణం వద్ద బాధితులు శనివారం ఆందోళనకు దిగారు. చీటీల నిర్వాహకుడు అక్కడికి రాకపోవడంతో మహిళలు ఆగ్ర హంతో దుకాణంలో ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. మోసపోయిన తమకు ప్రభుత్వమే న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు. ఈ తరహా నేరాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోకపోవడంతో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు.

ఝఛీ=ౌటజంన్ఛీ్జ