Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 14 2014 @ 03:31AM

రిజిసే్ట్రషన్‌లో ఫార్మెట్‌ వ్యవస్థ వద్దు

గవర్నర్‌పేట: రిజిసే్ట్రషన్‌ ప్రక్రియలో ఫార్మెట్‌ వ్యవస్థను ప్రవేశ పెట్టడం వల్ల వేలాది మంది దస్తావేజు లేఖరుల కుటుంబాలు రోడ్డున పడతాయని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర దస్తావేజు లేఖరుల సంఘం ఆవేదన వ్యక్తం చేసింది. గాంధీనగర్‌లోని జింఖానా గ్రౌండ్స్‌లోని కందుకూరి కల్యాణ మండపంలో శనివారం సమావేశం జరిగింది. 13 జిల్లా సంఘాల అధ్యక్ష, కార్యదర్శులతో పాటు పెద్ద సంఖ్యలో దస్తావేజు లేఖరులు హాజరయ్యారు. రాష్ట్ర అధ్యక్షులు తుమ్మలపల్లి హరికృష్ణ అధ్యక్షతన జరిగిన సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.వేణుగోపాల్‌ మాట్లాడుతూ ప్రభుత్వం ఫార్మెట్‌ పద్ధతిలో రిజిసే్ట్రషన్‌ ప్రక్రియ చేపట్టాలన్న ఆలోచన విరమించుకోవాలన్నారు. కొత్త వ్యవస్థను ప్రవేశపెట్టడం వల్ల స్థిరాస్తి కొనుగోలు దారులు అవగాహనలేక నష్టపోయే ప్రమాదముందన్నారు. దస్తావేజు లేఖరుల లైసెన్సులు పునరుద్ధరించకుండా తాత్సర్యం చేయడం సరికాదన్నారు. స్లాట్‌ బుకింగ్‌ విధానం ద్వారా రిజిసే్ట్రషన్‌ ప్రక్రియ నిలుపుదల చేయాలని డిమాండ్‌ చేశారు. తమ డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడతామన్నారు. సభకు అధ్యక్షత వహించిన తుమ్మలపల్లి హరికృష్ణ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు కూడా అప్పటి కరణీకం, పట్వారీ వ్యవస్థలను రద్దు చేశారు. దస్తావేజు లేఖరుల వ్యవస్థను కొనసాగించారన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర స్టీరింగ్‌ కమిటీ చైర్మన్‌ సుబ్బారావు, సంఘం రాష్ట్ర న్యాయసలహాదారు కొంగర సాయి, రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎలియాజర్‌, రాష్ట్ర జాయింట్‌ సెక్రటరీ సి.హెచ్‌.నాగసత్యనారాయణ మూర్తి, సెక్రటరీ దాసరి సుధాకర్‌, జిల్లా అధ్యక్షుడు నేరెళ్ల నారాయణ తదితరులు పాల్గొన్నారు.