Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 14 2014 @ 03:31AM

సమర్థ విధి నిర్వహణే ఉద్యోగులకు గీటురాయి

(విజయవాడ, ఆంధ్రజ్యోతి)
సమర్ధ విఽధుల నిర్వహణే ఉద్యోగులకు గీటు రాయి అని సమాచార అధికారులు, ఉద్యోగుల సంఘం నూతన అధ్యక్షుడు ఎం.ప్రాన్సిస్‌ అన్నారు. విజయవాడలో సమాచార పౌరసంబంధాలశాఖ అధికారులు, ఉద్యోగుల సంఘం 13 జిల్లాల ప్రతినిధుల సమావేశం శనివారం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నికయిది. అఽధ్యక్షుడుగా ఎన్నికయిన ప్రాన్సిస్‌ మాట్లాడుతూ అధికారులు, ఉద్యోగులు సమన్వయంతో పనిచేయాలన్నారు. సిబ్బంది సమస్యలను పరిష్కరించడంలో శక్తి వంచన లేకుండా పని చేస్తానన్నారు. ప్రభుత్వ పథకాలను ప్రజల వద్దకు చేర్చడంలో సమాచార పౌరసంబంధాల శాఖ కీలకమన్నారు. ప్రభుత్వానికి-ప్రజలకు వారధిగా నిలవాలని కోరారు. గౌరవ అధ్యక్షుడు చోరగుడి జాన్షన్‌ మాట్లాడుతూ సమాచార శాఖ పబ్లిసిటీ విభాగం ఏర్పడి మూడు దశాబ్దాలు అయిందన్నారు. పత్రికలలో ప్రచురితయమ్యే కథనాలలో వాస్తవాలను తీసుకుని వాటిని విశ్లేషించడంలో కూడా కీలకంగా వ్యవహరించాలని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన ఏడు మిషన్లను ప్రజలకు చేరువగా తీసుకు వె ళ్ళేందుకు పనిచేయాలని కోరారు. జోన్‌-1 ప్రాంతీయ సంయుక్త సంచాలకుడు రాజబాబు మాట్లాడుతూ పదోన్నతుల విషయంలో అన్యాయం జరుగుతున్నదని, నిధులు కూడా తక్కువగానే విడుదల చేస్తున్నారన్నారు.
ఉపాధ్యక్షుడు బి.పూర్ణచంద్రరావు మాట్లాడుతూ సమాచార శాఖలోకి ఇతర మార్గాల ద్వారా వస్తున్నారన్నారు. ఇటువంటి పోస్టులు నిలుపుదల చేయాలని సమావేశం తీర్మానిం చింది. ఉద్యోగుల భద్రతకు, హక్కులకు భం గం కలిగితే న్యాయ పోరాటం చేస్తామన్నారు.
నూతన కార్యవర్గం
రాష్ట్ర అధ్యక్షుడిగా ఎం.ప్రాన్సిస్‌, ఉపాధ్యక్షలుగా ఎస్‌.వెంకటేష్‌(హైదరాబాద్‌), బి.పూర్ణ చంద్రరావు(ప్రకాశం), బి.సూర్యచంద్రరావు (హైదరాబాద్‌), జనరల్‌ సెక్రటరీ బాబ్జీ(విశాఖపట్నం), కార్యనిర్వహక శాఖ కార్యదర్శిలుగా ఎస్‌.శ్రీనివాసజీవన్‌(హైదరాబాద్‌), విజయసింహారెడ్డి( చిత్తూరు), సంయుక్త కార్యదర్శులుగా లలిత(హైదరాబాద్‌), తిమ్మప్ప(అనంతపురం), కోశాధికారిగా జి.వి.ప్రసాద్‌ (హైదరాబాద్‌), గౌరవ అధ్యక్షులుగా డి.శ్రీనివాస్‌(హైదరాబాద్‌), చోరగుడి జాన్షన్‌ ఎన్నికయ్యారు. మరో 16 మంది కార్యవర్గ సభ్యులు ఎన్నికయ్యారు. జి.గోవిందరాజులు ఎన్నికల అధికారిగా వ్యవహరించారు.