Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 14 2014 @ 03:31AM

నేడు విద్యుత్‌ సరఫరా నిలిపివేత

మచిలీపట్నం-ఈడేపల్లి: పట్టణ పరిధిలోని భాస్కరపురంలో ఆదివారం ఉదయం రెండున్నర గంటల సేపు విద్యుత్‌ సరఫరా నిలిపివేస్తున్నట్టు ఎలక్ర్టికల్‌ ఏఈ ఏడుకొండలు తెలిపారు. ఉదయం 6 గంటల నుంచి ఎనిమిదిన్నర గంటల వరకు విద్యుత్‌ సరఫరా నిలిపి వేస్తారని తెలిపారు.
సాగునీటి కాలువలను పరిశీలించిన మంత్రి కొల్లు రవీంద్ర
మచిలీపట్నం-ఈడేపల్లి: మండల పరిధిలోని వివిధ గ్రామాలలో సాగునీటి సరఫరాను రాష్ట్ర బీసీ సంక్షేమ, చేనేత, ఎక్సైజ్‌ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర శనివారం పరిశీలించారు. పాతేరు, కోన, తుమ్మలచెరువు, వాడగొయ్యి, సత్యనారాయణపురం, వాడపాలెం, కెపిటి పాలెం, పెదయాదర, చినయాదర, ఎన్‌ గొల్లపాలెం, చిన్నాపురం, గుండుపాలెం తదితర గ్రామాల్లో మంత్రి రవీంద్ర విస్తృతంగా పర్యటించారు. సాగునీరు అందడం వల్ల రైతులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ పర్యటనలో మంత్రితో పాటు జడ్పీటీసీ లంకే నారాయణప్రసాద్‌, ఎంపీపీ కాగిత వెంకటేశ్వరరావు, మండల టీడీపీ అధ్యక్షుడు గోపు సత్యనారాయణ, గొర్రెపాటి గోపీచంద్‌, వడ్లమూడి త్రివిక్రమరావు, రాజులపాటి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
ఏసుక్రీస్తు బోధనలు ఆచరించాలి
మచిలీపట్నం-ఈడేపల్లి: ఏసుక్రీస్తు బోధించిన ప్రేమ, సేవ మార్గాలను ఆచరించాలని గుణదల సోషల్‌ సర్వీసు సెంటర్‌ డైరెక్టర్‌ మువ్వల ప్రసాద్‌ అన్నారు. స్థానిక ఆర్సీయం చర్చిలో శనివారం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రెవరెండ్‌ పసల తోమాస్‌, జోసఫ్‌ వినోద్‌, అనిల్‌కుమార్‌, మువ్వల యోహాను తదితరులు ప్రసంగించారు.
విద్యార్థులలో పోటీతత్వం పెంచాలి
మచిలీపట్నం-ఈడేపల్లి: విద్యార్థుల్లో ఆరోగ్యకరమైన పోటీతత్వం పెంచాలని రోటరీక్లబ్‌ అధ్యక్షురాలు జి.రాజేశ్వరి పేర్కొన్నారు. రోటరీ యువజన మాసోత్సవాల సందర్భంగా శనివారం రోటరీ హాలులో వాసవీ ఇంజనీరింగ్‌ కళాశాల ఏవో మేజర్‌ పి మెహర్‌కుమార్‌ విద్యార్థులకు క్విజ్‌ పోటీలు నిర్వహించారు. ఎంవి సీతాపతిరావు, శేషాచార్యులు, శ్రీనివాస్‌, ప్రదీప్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

్జూ