Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 14 2014 @ 03:31AM

అథ్లెటిక్స్‌లో గంగాధరపురం విద్యార్థుల ప్రతిభ

గుడివాడరూరల్‌: అథ్లెటిక్‌ పోటీల్లో మండలంలోని గంగాధరపురం ఉన్నత పాఠశాల విద్యార్థులు జక్కుల కీర్తి 100 మీటర్ల పరుగు పందెంలో జిల్లా తృతీయ స్థానం సాధించింది. ఈనెల 9,10 తేదిల్లో జిల్లా అఽథ్లెటిక్‌ అసోసియేషన్‌ ఛాంపియన్‌ షిప్‌ పోటీలు విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో నిర్వహించారు. 14సంవత్సరాల బాలుర విభాగంలో జాషువా చక్రవర్తి ద్వితీయస్థానం సాధించారు. 16సంవత్సరాల బాలికల విభాగం హైజంప్‌లో గుజార్లమూడి పూర్ణిమలక్ష్మి ద్వితీయస్థానం సాధించారు. జిల్లాస్థాయిలోపేరు తెచ్చిన విద్యార్థులను, శిక్షణ ఇచ్చిన పీడీ పొట్లూరి చంద్రశేఖర్‌, హెచ్‌ఎం ఉప్పల రమేష్‌బాబులను ఎమ్డీవో ఎ.వెంకటరమణ, సర్పంచ్‌ అవ్వారు రేణుకాదేవి, ఎంఈవో జి.చినవెంకటేశ్వరరావు, గ్రామపెద్దలు అభినందించారు.