Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 14 2014 @ 03:31AM

ఆంధ్ర తిలక్‌

(ఆంధ్రజ్యోతి, విజయవాడ)
గాడిచర్ల హరిసర్వోత్తమరావు 1883 సెప్టెంబర్‌ 14న భాగీరథీభాయి, వెంకట్రావు దంపతులకు కర్నూలులో జన్మించారు. 1906లో మద్రాస్‌ క్రైస్తవ కళాశాల నుంచి ఎంఏ పట్టా పొందాడు. 1907లో రాజమండ్రిలో ఉపాధ్యా య విద్యనభ్యసిస్తూ వందేమాతరం ఉద్మమంలోకి కొదమసింహంలో ప్రవేశించి ఆంధ్ర తిలక్‌గా పేరొందారు. బెంగాల్‌ విభజనకు నిరసనగా 1905లో దేశవ్యాప్తంగా వందేమాతరం ఉద్యమం రావడంతో బిపిన్‌ చంద్రపాల్‌ రాజమండ్రిలో చేసిన ఉపన్యాసానికి ప్రభావితుడయ్యారు. విద్యార్థులంతా వందేమాతరం బ్యాడ్జీలతో, నల్ల జెండాలతో తరగతి గదులకు హాజరవటాన్ని సహించని కళాశాల ప్రిన్సిపాల్‌ మార్క్‌ హంటర్‌ వాటిని తీసి వేస్తేనే తరగతి గదుల్లోకి అనుమతిస్తానని హుకుం జారీ చేసినా లెక్క చేయకపోవటంతో విద్యార్థి నాయకుడు గాడిచర్లను కళాశాల నుంచి బహిష్కరించారు. అంతేకాక ప్రభుత్వ ఉద్యోగాలకు అనర్హుడిగా ప్రిన్సిపాల్‌ ప్రకటించారు. బోడినారాయణరావుతో కలసి 1908లో ‘స్వరాజ్య’ పత్రికను ప్రారంభించారు. 1908లో తిరునల్వేలిలో ‘ఆష్‌’ అనే ఆంగ్లేయ అధికారిని విప్లవకారులు కాల్చి చంపిన సమయంలో పోలీసు కాల్పు ల్లో ముగ్గురు అమాయకులు మరణించారు. పోలీసు చర్యను ఖండిస్తూ గాడిచర్య తన పత్రికలో ‘తెల్లదొరల విపరీత బుద్ధి’ శీర్షికన ఘాటుగా విమర్శిస్తూ సంపాదకీయాన్ని రాసి జాతి జనుల్లో స్వరాజ్య కాంక్షను రగిలించారు. దీంతో ఆగ్రహించిన ఆంగ్ల అధికారులు గాడిచర్లకు మూడు సంవత్సరాల జైలు శిక్ష విధించారు. ఆయన జైలు జీవితాన్ని ‘నేను-నా దేశం’ అనే గ్రంథంలో దర్శి చెంచయ్య వివరించారు.
గాడిచర్ల 1923లో చిత్తరంజన్‌దాస్‌, మోతీలాల్‌ నెహ్రూ నెలకొల్పిన స్వరాజ్య పార్టీలో చేరారు. 1924 సంవత్సరంలో కాకినాడలో జరిగిన అఖిల భారత కాంగ్రెస్‌ మహాసభల్లో స్వయం సేవక్‌ సంస్థ ‘‘హిందు స్థానీ సేవాదళ్‌’’ స్థాపనలో ప్రముఖ పాత్ర వహించారు. 1927లో ఆంధ్రకాంగ్రెస్‌ అభ్యర్థిగా నంద్యాల నుంచి మద్రాసు లెజిస్లేటివ్‌ కౌన్సిల్‌కు పోటీ చేసి విజయం సాధించారు. కొమర్రాజు వెంకటలక్ష్మణరావు ప్రారంభించిన విజ్ఞాన చంద్రిక గ్రంథమండలి కార్యదర్శిగా ఉంటూ ‘అబ్రహం లింకన్‌’ గ్రంథాన్ని రంచించారు. గ్రీస్‌దేశ చరిత్ర, విస్మృత కవిసార్వభౌముడు, శ్రీరామ చరిత్రకు వ్యాఖ్య రాశారు. పంచాయతీ మహాసభ, సహకార మహాసభ, హిందీ మహాసభ, ఉపాధ్యాయ మహాసభ లాంటి ఎన్నో సభలకు అధ్యక్షత వహించారు. అనిబిసెంట్‌ ‘హోమ్‌ రూల్‌ లీగ్‌’ ఆంధ్రశాఖకు కార్యదర్శిగా పనిచేశారు. 1928లో నంద్యాలలో సర్వేపల్లి రాధాకృష్ణన్‌ అధ్యక్షతన జరిగిన ఆంధ్ర మహాసభలో దత్తమండలాలకు ‘రాయల సీమ’గా నామకరణం చేశారు. కొంతకాలం ఆంధ్రపత్రికకు మొదటి సంపాదకుడిగా ఉన్నారు. తాడిపత్రిలో ‘మాతృసేవ’ పత్రిక స్థాపనకు సంకటి కొండారెడ్డిని ప్రోత్సహించటమే కాక సుబ్రహ్మణ్యశర్మతో కలిసి ‘కామోదక’ పత్రికను స్థాపించారు. ఆయుర్వేద వైద్యంపై విస్తృత ప్రచారం చేశారు. హిం దూ పత్రికకు సమీక్షలెన్నో రాశారు. 1950 లో మద్రాసు రాష్ట్ర ప్రభుత్వం గాడిచర్లను ఆంధ్ర ప్రాంత వయోజన విద్యా డైరెక్టర్‌గా నియమించింది.
‘సర్వోత్తమ’
గ్రంథాలయం
గాడిచర్ల హరి సర్వోత్తమరావు 1936 మార్చి 15 నుంచి 1960 ఫిబ్రవరి 29 వరకు ఆంధ్రదేశ గ్రంథాలయ సంఘం అధ్యక్షులుగా ఉన్నారు. గాడిచర్ల సేవలకు చిహ్నంగా విజయవాడలోని పటమటలో గ్రంథాలయ భవనం నిర్మించారు. గాడిచర్లను తండ్రిగా భావించిన పాతూరి నాగభూషణం 1987 మార్చి 30 ఉగాది పర్వదినాన ఆ భవనానికి ‘సర్వోత్తమ గ్రంథాలయం’’ అని నామకరణం చేశారు. ఈ గ్రంథాలయం 365 రోజులూ పాఠకుల కోసం ఉదయం 8గంటల నుంచి రాత్రి 8గంటల వరకు తెరిచే ఉంటుంది.

2ర్ఙఫంనీఇ్ష్జ