Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 14 2014 @ 03:29AM

పది రాష్ట్రాల్లో ఉప ఎన్నికలు


ఓ మోస్తరు నుంచి భారీ పోలింగ్‌

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాలనకు తొలి అగ్నిపరీక్షగా విశ్లేషక లు భావిస్తున్న ఉప ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. పది రాష్ట్రాల్లో ని 3 లోక్‌సభ, 33 అసెంబ్లీ స్థానాల్లో ప్రజలు తరలివచ్చి ఏవీయంలలో తమ తీ ర్పును నిక్షిప్తం చేశారు. రెండేసి స్థానాల్లో గెలిచిన ప్రధాని మోదీ, సమాజ్‌వాది పార్టీ చీఫ్‌ ములాయం గుజరాత్‌, యూపీలో వడోదర, మెయిన్‌పురి నియోజకవర్గాలకు రాజీనామా చేశారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌ మెదక్‌ లోకసభ స్థానాన్ని వదులుకున్నారు. దీంతో ఈ మూడుచోట్ల ఉప ఎన్నిక అవసరమైంది. ఈ నేపథ్యంలో మూడు పార్టీలకూ ఈ ఫలితాలు ప్రతిష్ఠాత్మకమే. ఇక ములాయం కు టుంబంలో తరువాతి తరం ప్రతినిధి తేజ్‌ప్రతాప్‌ సింగ్‌ రాజకీయ అరంగేట్రం చేస్తుండటం విశేషం. ఈ మూడు స్థానాల్లో 49, 56, 67 శాతం పోలింగ్‌ నమోదైంది. ఇక అసెంబ్లీ స్థానాల సంగతి చూస్తే యూపీలో 11 చోట్ల 53 శాతం, గుజరాత్‌లోని 9 నియోజకవర్గాల్లో 49 శాతం, ఏపీలోని నందిగామలో 68 శాతం పోలింగ్‌ నమోదైంది. ఈసీ ఈ నెల 16న ఫలితాలను ప్రకటించనుంది.