Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 14 2014 @ 03:29AM

కశ్మీర్‌ వరదలతో పాతికేళ్లకు మాతృభూమికి!


సేవలందించేందుకు వచ్చిన డాక్టర్‌

శ్రీనగర్‌: వరద కశ్మీరం దూరాలను చేరువ చేస్తోంది. పాత అనుబంధాలను, తీపి గుర్తులను జ్ఞప్తికి తెస్తోంది. ఎన్నో ఏళ్ల క్రితం ఈ ప్రాంతాన్ని వదిలి వెళ్లిపోయిన వారిని మళ్లీ మాతృభూమికి సేవలందించేలా కదిలిస్తోంది. 25 ఏళ్ల క్రితం కశ్మీర్‌ను వదిలి వెళ్లి, ఇండిగో ఎయిర్‌లైన్స్‌లో డాక్టర్‌గా పనిచేస్తున్న రాజ్‌కుమార్‌ కార్వాని.. ఇప్పుడు తన సొంతగడ్డకు సేవ చేసేందుకు రోజూ ఢిల్లీ నుంచి వచ్చి వెళుతున్నారు. శ్రీనగర్‌ ఎయిర్‌పోర్ట్‌లో బాధితులకు వైద్య సేవలందిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మళ్లీ తాను కశ్మీర్‌లో అడుగుపెడతానని అనుకోలేదని రాజ్‌కుమార్‌ ఈ సందర్భంగా వాపోయారు. మరో మారు తన తల్లిదండ్రులతో వచ్చి ఇక్కడ తన సొంత ఇంటిని చూసి వెళ్తానని చెప్పారు. కాగా, శ్రీనగర్‌లో వరదల్లో ఇండిగో ఎయిర్‌లైన్స్‌ సిబ్బంది గల్లంతు కావడంతో, ఆ సంస్థ ఢిల్లీ విమానాశ్రయంలో పనిచేసే తమ సిబ్బందిని ఇక్కడ సేవలందించేందుకు పంపించింది. బస చేసేందుకు వసతి లేకపోవడంతో వారంతా రోజూ విమాన మొదటి సర్వీసులో శ్రీనగర్‌కు వచ్చి చివరి సర్వీసులో మళ్లీ ఢిల్లీ వెళుతున్నారు.