Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 14 2014 @ 03:29AM

ప్రపంచ ఫోన్లపై మరో 90 రోజులు నిఘా


వాషింగ్టన్‌ : అమెరికన్‌ ప్రభుత్వానికి మరో మూడు నెలల పాటు ప్రపంచ ప్రజల ఫోన్‌కాల్స్‌పై నిఘా వేసే అవకాశం లభించింది. ఫారిన్‌ ఇంటెలిజెన్స్‌ సర్వైలెన్స్‌ కోర్టు(ఎఫ్‌ఐఎస్‌సీ).. నేషనల్‌ సెక్యూరిటీ ఎజెన్సీ (ఎన్‌ఎస్‌ఏ)కి ఈ అధికారాన్ని కట్టబెట్టింది. కోర్టు ఆదేశాల ప్రకారం, ఎన్‌ఎస్‌ఏకి ప్రజల ఫోన్‌కాల్స్‌ సమాచారాన్ని సేకరించే అవకాశం డిసెంబర్‌ ఐదో తేదీ వరకు ఉంటుంది. దీనికి సంబంధించి ప్రభుత్వం చట్టం చేయాల్సి ఉంది. ఆ చట్టాన్ని ప్రతినిధుల సభ ఆమో దించినా, సెనేట్‌ ఆమోదించలేదు.
దీంతో సెనేట్‌ ఆమోదించే వరకూ.. ప్రజల ఫోన్‌కాల్స్‌ సమాచారం సేకరించి భద్రపరచడానికి 90 రోజులకు ఒకసారి, ఎన్‌ఎస్‌ఏ.. ఎఫ్‌ఐఎస్‌సీ అనుమతిని పొందాల్సి ఉంటుంది. ఎన్‌ఎస్‌ఏకి కంట్రాక్టర్‌గా పని చేసిన ఎడ్వర్డ్‌ స్నోడెన్‌ ఈ వివరాలను బహిర్గతం చేయడంతో విషయం కోర్టుకెక్కింది. దీంతో ప్రజల ఫోన్‌కాల్స్‌ సమాచారం సేకరించడానికి ఎన్‌ఎస్‌ఏకు కోర్టు అనుమతి లేదా ఒక చట్టం అవసరమైంది.