Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 14 2014 @ 03:19AM

రాయిపల్లిలో నేడు బసవేశ్వర విగ్రహావిష్కరణ


రాయికోడ్‌: మండల పరిధిలోని రాయిపల్లి(సి) గ్రామంలో నూతనంగా నిర్మించిన బసవేశ్వర విగ్రహాన్ని ఆదివారం ఉదయం 11గంటలకు ఆవిష్కరించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమానికి జహీరాబాద్‌ పార్లమెంట్‌ సభ్యుడు బీబీపాటిల్‌, బిచ్‌కుందా మఠాధిపతి సోమాయప్పస్వామి, బర్దిపూర్‌ ఆశ్రమ పీఠాధిపతి అవదూతగిరి మహారాజ్‌, ఇందూర్‌ ఆశ్రమ పీఠాధిపతి చెన్నమల్లికార్జునస్వామి, నల్లంపల్లి ఆత్మలింగ మహారాజ్‌ ఆశ్రమ పీఠాధిపతి నాగమణమ్మ, ఇతర ప్రముఖులు హాజరుకానున్నట్లు వారు తెలిపారు.
ఈ కార్యక్రమానికి మండల పరిధిలోని ఆయా గ్రామాల బసవేశ్వర భక్తులు, లింగాయత్‌సమాజ్‌ సభ్యులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొనాలని వారు కోరారు.