Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 14 2014 @ 03:14AM

గుట్టలో ‘విలేజ్‌ లవ్‌’ షూటింగ్‌


యాదగిరిగుట్ట రూరల్‌: పట్టణంలోని గోశాలలో ఎస్‌ఎం పీ క్రియేషన్స్‌ పతాకంపై నిర్మిం చే విలేజ్‌లవ్‌ నూతన చిత్రానికి శనివారం ఎమ్మెల్యే సునీతామహేందర్‌రెడ్డి పూజలు నిర్వహించి ప్రారంభించారు. ఈ సం దర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణ ఏర్పడిన తర్వాత ఈ ప్రాంతానికి చెందిన దర్శకులు చేపట్టే చిత్రాలకు కేసీఆర్‌ ప్రభు త్వం అన్ని విధాలుగా సహకరిస్తుందని శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆశీస్సులతో నిర్మించే సినిమా తెలంగాణలోనే నెంబర్‌వన్‌గా నిలుస్తుందని అన్నారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన చాంద్‌పాష రచన, కథ, స్ర్కీన్‌ప్లే, దర్శకత్వం వహిస్తుండగా రియాజ్‌ నిర్మిస్తున్నారు.
హీరోహీరోయిన్లుగా ఆనంద్‌, అనూష నటిస్తున్నారు. యాదగిరిగుట్ట 10 రోజులు చిత్ర షూటింగ్‌ ఉంటుందని దర్శకుడు చాంద్‌పాష తెలిపారు. మొదటి షాట్‌కు ఎమ్మెల్యే క్లాప్‌ ఇవ్వగా కెమెరామన్‌ ఆనంద్‌శ్రీరాం చిత్రీకరించారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ప్రేమ, అమ్మాయిలపై కథనం సాగుతుందని తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్‌ బూడిద స్వామి, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు కర్రె వెం కటయ్య, యువజన విభాగం అధ్యక్షుడు గడ్డమీది రవీందర్‌గౌడ్‌, సర్పంచుల ఫో రం మండల అధ్యక్షుడు శ్రీనివాస్‌గౌ డ్‌, ఎంపీటీసీ కృష్ణగౌడ్‌, కాంటేకర్‌ పవన్‌కుమార్‌, చిన్న పాల్గొన్నారు.ాని