Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 14 2014 @ 03:03AM

స్నేహితుడే హంతకుడు

భార్యపై అభాండం వేశాడని కక్ష
హత్య వివరాలు వెల్లడించిన పోలీసులు
పరిగి: వారిద్దరూ మంచి స్నేహితులు. ఇద్దరి మధ్య స్నేహం కొంతకాలం నుంచి దూరమైనప్పటకీ ఇటివల కలుసుకున్నారు. అయితే వీరు మద్యం మత్తులో వ్యక్తిగత జీవితాలపై జరిగిన మాటల సంభాషణ వల్ల క్షణికావేశానికి గురవడంతో ఓ యువకుడి హత్యకు దారి తీసింది. పరిగి సీఐ పి.ప్రసాద్‌ శనివారం సాయంత్రం విలేఖరులకు వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి.
పరిగి పట్టణానికి చెందిన ఎండీ ఖుర్షీద్‌(30), అహ్మద్‌పాష(28) స్నేహితులు. బతుకుదెరువు కోసం పరిగికి వచ్చి స్థిరపడ్డారు. ఖుర్షీష్‌ పూలవ్యాపారి దగ్గర దినసరికూలి కాగా, ఆహ్మద్‌పాష చిన్నడబ్బాలో చెప్పులు వ్యాపారం నిర్వహిస్తుంటాడు. పదేళ్ళుగా పరిగిలోనే ఉంటున్న వీరి మధ్య బంధుత్వం ఉంది, అంతకంటే ఎక్కువ మంచి మిత్రులు కూడా. ఇద్దరి స్నేహంలో కొంతకాలం నుంచి దూరమయ్యారు. నాలుగున రాత్రి పరిగి ఆర్టీసీ బస్‌స్టేషన్‌ సమీపంలో తారసపడ్డారు. ఇద్దరు క్షేమాల గురించి చర్చించుకున్నారు. అంతకుముందే ఇద్దరు వేర్వేరుగా మద్యం తాగిన వారు మళ్లీ మద్యం సేవించారు. వారం రోజుల నుంచి తన భార్య తల్లిగారి ఇంటికి వెళ్ళి రావడం లేదని పాష, ఖుర్షీద్‌కు చెప్పాడు. అయితే మీ భార్య ఇతరులతో వివాహేతర సంబంధం పెట్టుకోవడం వల్లనే రావడం రాలేదని చెప్పడం, ఇద్దరి మధ్య వ్యక్తిగత జీవితాలపై సంభాషణ వివాదానికి దారి తీసింది. తన భార్య గురించి చెడుగా మాట్లాడుతున్నాడని పాష మనసులో కక్ష పెంచుకున్నాడు. దీంతో వీరిద్దరు బస్టాండ్‌ సమీపంలో ఖుద్దూస్‌ పాన్‌షాపుకు వెళ్లి పాన్‌లు కట్టించుకుని పాష బైక్‌పై ఖర్షీద్‌ను తీసుకొని మళ్ళీ మద్యం షాపుకు వెళ్లారు. అప్పటికే మద్యం షాపు మూసివేయడంతో దోమ మండలం శివారెడ్డిపల్లి గ్రామంలో లభిస్తుందని బైక్‌పై వెళ్లారు. శివారెడ్డిపల్లి శివారులోని టీఆర్‌ఆర్‌ పాంహౌజ్‌ దగ్గరకు వెళ్ళి బైక్‌ను నిలిపారు. మద్యం మత్తులో ఉన్న ఖుర్షీద్‌ను తన భార్య గురించి చెడుగా మాట్లాడతావా.. అంటూ కాలర్‌పట్టుకుని కిందపడేసి కొట్టాడు. అంతటితో ఆగకుండా అక్కడే ఉన్న రాతికడీతో తలపై బాది హత్య చేశారు. అక్కడ లభించిన ఎయిర్‌టెల్‌ ఫోన్‌ సిమ్‌కార్డు ఆధారంగా విచారణ చేపట్టగా ఆధారాలు లభించాయని సీఐ తెలిపారు. సీమ్‌కార్డు ఆధారంగా అనుమానితంగా భావించి మహ్మద్‌పాషను అదుపులోకి తీసుకుని విచారణ చేయగా, చేసిన నేరాన్ని ఒప్పుకున్నాడని తెలిపారు. నిందితుడిని శనివారం రిమాండ్‌కు తరలించినట్లు సీఐ తెలిపారు.