Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 14 2014 @ 03:02AM

డిప్యూటీ డీఈవో విచారణ


విధులకు గైర్హాజరుపై
సీరియస్‌... మెమో జారీ
బషీరాబాద్‌ : మండలంలోని జీవన్గి జెడ్పీ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఇష్టా రాజ్యంగా వ్యవహరిస్తూ విధులకు సక్రమంగా రావడం లేదని వచ్చిన ఫిర్యాదుపై డిప్యూటీ డీఈవో హరిశ్చందర్‌ శనివారం విచారణ జరిపారు. స్థానిక విద్యాధికారి మహిపాల్‌రెడ్డితో కలిసి ఆయన పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడి ప్రధానోపాధ్యాయుడు సురేందర్‌రెడ్డి ఎలాంటి సమాచారం, అను మతి లేకుండా పాఠశాలకు గైర్హాజరవడం గుర్తించిన డిప్యూటీ డీఈవో సీరియస్‌గా తీసుకున్నారు. అక్కడున్న ఇన్‌చార్జీ ప్రధానోపాధ్యాయుడు రవిని అటెండెన్స్‌ రిజిష్టర్‌ను పరిశీలించారు. రిజిష్టర్‌లో సదరు ప్రధానోపాధ్యాయుడు పలుమార్లు క్యాజువల్‌ లీవ్‌(సీఎల్‌) వేసుకుని, తర్వాత దిద్ది సంతకాలు చేసినట్లు డిప్యూటీ డీఈవో గుర్తించి రిజిష్టర్‌ స్వాఽఽధీనం చేసుకున్నారు. అలాగే పాఠశాలలో పనిచేస్తున్న శ్రీనివాస్‌ ఈ విద్యా సంవత్సరం ఆరంభం నుంచి పాఠశాలకు గైర్హాజరవడంపై ఆయన విచారణ జరిపారు. ఇక్కడి పాఠశాలలో పని చేస్తున్న మరో ఉపాధ్యాయురాలు ప్రణవిపై విచారించారు. ఆమె పలుమార్లు దీర్ఘకాలిక సెలవుపై వెళ్లినా ప్రధానోపాధ్యాయుడు సురేందర్‌రెడ్డి ఎలాంటి సమాచారం ఇవ్వకపోగా, తిరిగి జాయిన్‌ చేసుకుని సదరు ఉపాధ్యాయురాలు జీతంపొందేలా సహకరించినట్లు రికార్డుల తనిఖీలో తేలడంతో డిప్యూటీ డీఈవో సీరియస్‌గా స్పందిస్తూ రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం ఉపాధ్యాయురాలు మెటర్నటీ లీవ్‌లో ఉన్నట్లు ఆయన వెల్లడించారు. ఈ విషయాన్ని సీనియస్‌గా తీసుకున్న డిప్యూటీ డీఈవో బషీరాబాద్‌ ఎమ్మార్సీ భవనానికి చేరుకుని డీఈవో ఆదేశానుసారం అక్కడికక్కడే మెమో టైప్‌ చేయించి ప్రధానోపాధ్యాయుడు సురేందర్‌రెడ్డికి అందించాలని ఇన్‌చార్జీ ప్రధానోపాధ్యాయుడుని ఆదేశించారు. ఎవ రైనా ఉపాధ్యాయులు పాఠశాలలో సెల్‌ఫోన్లు ఉపయోగిస్తే చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
రైల్లో వచ్చే ఉపాధ్యాయులపై
నిఘా పెట్టండి...
ఉపాధ్యాయులు పాఠశాలలకు సమయానుకూలంగా రావడం లేదనే ఫిర్యాదులున్నాయని, పలు వురు ఉపాధ్యాయులు రైళ్లలో రాకపోకలు సాగిస్తున్నందున ప్రత్యేక దృష్టి సారించి ఏయే ఉపాధ్యాయులు ఆలస్యంగా వస్తున్నారో రిపోర్టు చేయాలని డిప్యూటీ డీఈవో హరిశ్చందర్‌ సీఆర్పీల(క్లస్టర్‌ రిసోర్స్‌పర్సన్‌)ను ఆదేశించారు. బషీరాబాద్‌ ఎమ్మార్సీ భవనంలో విద్యాధికారి మహిపాల్‌రెడ్డితో ఉపాధ్యాయుల సమయపాలన, రాకపోకలపై చర్చిస్తూ ఆరా తీశారు. ఉపాధ్యాయులు రైల్లో 9 గంటల తర్వాతనే వస్తున్నారనే విషయాన్ని తెలుసుకున్న డిప్యూటీ డీఈవో రైలు ఉదయం బషీరాబాద్‌కు ఏ సమయానికి వస్తుంది, తిరిగి సాయంత్రం ఉపాధ్యాయులు వెళ్లే రైలు ఎప్పుడు వెళుతుందనే దానిపై వారం రోజులపాటు పరిశీలించి సమయ పాలనను నోట్‌ చేసుకోవాలని సీఆర్పీలకు ఆయన సూచించారు.