Server-91
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 14 2014 @ 03:02AM

‘మాలల హక్కుల కోసం ఉద్యమిస్తాం’


పరిగి : మాలల హక్కుల కోసం ఉద్యమిస్తామని మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షుడు జి.చెప్పయ్య అన్నారు. శనివారం పరిగిలోని అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేశారు. అనంతరం పాలకేంద్రంలో జరిగిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దళితుల భూములు అన్యాక్రాంతమయ్యాయని, వీటిపై ప్రభుత్వం చొరవ తీసుకుని దళితులకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. తెలంగాణ ప్రభత్వం చేపట్టిన భూ పంపిణీ శాసీ్త్రయంగా అమలు చేయాలని, మాలలకు ప్రభుత్వం తగిన ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. సమావేశంలో మాలమహానాడు రాష్ట్ర వర్కింగ్‌ అధ్యక్షుడు బి.రఘునాథ్‌, మాల విద్యార్థి సంఘం అధ్యక్షుడు పి.శ్రీకృష్ణ, జిల్లా ఉపాధ్యక్షుడు మేడి రాజేందర్‌, మానయ్య, పరిగి నాయకులు బి.ఆనందం, మొగులయ్య, జె.యాదయ్య, బి.రవికుమార్‌, ఆర్‌.రాములు, ఎం.రాములు, బి.ప్రవీన్‌, వెంకటయ్య, కిష్టయ్య, గోపాల్‌లు పాల్గొన్నారు.