Server-91
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 14 2014 @ 03:02AM

నిజాం వారసులమంటూ... భూకబ్జాకు యత్నం


అడ్డుకున్న రెవెన్యూ అధికారులు
ఇబ్రహీంపట్నం : మండల పరిధిలోని మంగల్‌పల్లి రెవెన్యూ ప్రభుత్వ భూమిలో నిజాం వారసులమంటూ కొందరు శనివారం బోర్డులు పాతేందుకు ప్రయత్నించగా రెవెన్యూ అధికారులు అడ్డు కున్నారు. నగరం నుంచి కొందరు వాహనాల్లో వచ్చి ప్లెక్సీలు, బోర్డులు పాతేందుకు యత్నించారు. విషయం తెలిసిన తహసీల్దార్‌ కె.వి.ఉపేందర్‌రెడ్డి సిబ్బందితో వచ్చి అడ్డుకు న్నారు. ఔటర్‌ రింగ్‌రోడ్డులో పాతిన రాళ్లను తొలగించారు. మంగల్‌పల్లి రెవెన్యూ సర్వేనెం. 124లో 171 ఎకరాలకు సంబంధించి గతంలో ప్రభుత్వం భూమి లేని పేదలకు అస్సైన్డ్‌పట్టాలు ఇచ్చింది. దీంట్లో ఎక్కువశాతం రైతులు ఈ భూములకు ఇతరులకు అమ్ముకున్నారు. మరో 40 ఎకరాల్లో రైతులు సాగుచేసుకుంటున్నారు. దీంతో ఇతరులకు అమ్ముకున్న భూము లను పీవోటీ కింద ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. ప్రభుత్వం ఇవే భూములను గతంలో దిల్‌ సంస్థకు 60 ఎకరాలు, ట్రక్‌ పార్కింగ్‌కు 40 ఎక రాలు, మెట్రోవాటర్‌బోర్డుకు సుమారు పదెకరాలు, కొన్ని భూములు హౌసింగ్‌ బోర్డుకు కేటాయించింది.
కాగా ఈ భూములపై కొందరు నిజాం వారసులమంటూ కోర్టులో కేసు వేశారు. ఇది సప్రీంకోర్టులో కూడా నడిచింది. కాగా తమకు కోర్టు డిక్రీ ఇచ్చిందంటూ కొందరు వాహనాల్లో వచ్చి బోర్డులు పాతే ప్రయత్నం చేయగా అధికారులు అడ్డుకున్నారు. ఈ భూములకు సంబంధించి ఏవైనా ఒరిజినల్‌ పత్రాలుంటే చూపాలని తహసీల్లార్‌ ఉపేందర్‌రెడ్డి చెప్పినప్పటికీ వీరు ససేమిరా అన్నారు. ఏదైనా తమకు పత్రాలు చూపకుండా భూమి లో అడుగుపెట్టరాదని తహసీల్దారు చెప్పడంతో వారు వెనుదిరిగి వెళ్లిపోయారు.