desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 14 2014 @ 02:57AM

అమ్మో ‘గ్యాస్‌’


బుక్‌ చేస్తే డెలివరీకి 15 రోజుల పైనే
బ్లాక్‌లోను ఆకాశాన్నంటుతున్న సిలిండర్‌ ఽధరలు
ఇబ్బందులు పడుతున్న వినియోగదారులు
గ్యాస్‌ వినియోగదారులకు తంటాలు తప్పడం లేదు. బుక్‌ చేస్తే డెలివరీకి 15 రోజుల పైనే పడుతుండడంతో అనేక ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా సింగిల్‌ సిలిండర్‌ ఉన్న వినియోగదారుల బాధలు వర్ణనాతీతం. గతంలో బుక్‌ చేసిన రెండు మూడు రోజుల్లో సిలిండర్‌ ఇంటికి వచ్చేది. కానీ ఇటీవల తూర్పుగోదావరి జిల్లా నగరంలో జరిగిన గ్యాస్‌ పైప్‌లైన్‌ దుర్ఘటన నేపథ్యంలో గ్యాస్‌ ఉత్పత్తికి కొన్ని అవాంతరాలు ఏర్పడడంతో ఆ ప్రభావం పరోక్షంగా వినియోగదారులపై పడింది. దాంతో గ్యాస్‌ వినియోగదారులకు ఇబ్బందులు తప్పడం లేదు. మరో పక్క బ్లాక్‌లో కూడా గ్యాస్‌ సిలిండర్‌ ధర ఆకాశాన్నంటుతుండడంతో ఏం చేయాలో తెలియక గ్యాస్‌ వినియోగదారులు సతమతమవుతున్నారు.
(జంగారెడ్డిగూడెం)
ఏజెన్సీ మెట్ట ప్రాంతాలకు ముఖ ద్వారమైన జంగారెడ్డిగూడెం పట్టణ జనాభాలో అధిక శాతం గ్యాస్‌ కనెక్షన్‌లను కలిగి ఉన్నారు. హెచ్‌పీ, భారత్‌ గ్యాస్‌ ఏజెన్సీల ద్వారా వినియోగదారులకు గ్యాస్‌ సిలిండర్లను సరఫరా చేస్తుంటారు. గ్యాస్‌ సిలిండర్‌ను బుక్‌ చేసుకునేందుకు ఆన్‌లైన్‌ విధానం ప్రవేశపెట్టిన నాటి నుంచి వినియోగదారులకు కొంత సౌలభ్యత ఏర్పడింది. కేవలం ఆయా గ్యాస్‌ కంపెనీల్లో నమోదు చేయించిన ఫోన్‌ నెంబర్‌ నుంచి సంబంధిత నెంబరుకు ఫోన్‌ చేసి సిలిండర్‌ను బుక్‌ చేసుకుంటే కేవలం ఒకటి, రెండు రోజుల్లో సిలిండర్‌ ఇంటికి చేరేది. అయితే గడచిన కొద్ది రోజులుగా గ్యాస్‌ సిలిండర్‌ను బుక్‌ చేసుకున్న 15 రోజులకు పైబడే గడువు పడుతుండడంతో వినియోగదారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. రెండు సిలిండర్‌లు ఉన్న వినియోగదారుల పరిస్థితి కొంత మెరుగైనా కేవలం ఒక్క సిలిండర్‌ ఉన్న వినియోగదారుల పరిస్థితి మాత్రం దారుణంగా ఉంటోంది. గ్యాస్‌ బుక్‌ చేసిన తరువాత సిలిండర్‌ వచే ్చ వరకు ఇంట్లో వంట చేసుకునేందుకు ప్రత్యామ్నాయాలను ఆన్వేషించే పరిస్థితి ఏర్పడింది. అలాగే గ్యాస్‌ కొరత ఏర్పడడంతో గతంలో రోజుకొక లోడు లారీ వచ్చేదని ప్రస్తుతం రెండు మూడు రోజులకొకలోడు వస్తుండడంతో వినియోగదారులకు సర్దుబాటు చేయడంలో కొంత ఇబ్బందులు ఏర్పడుతున్నాయని ఏజెన్సీల నిర్వాహకులు చెబుతున్నారు.
ఇదిలా ఉంటే బ్లాక్‌ మార్కెట్‌లో సైతం గ్యాస్‌ సిలిండర్ల ధరలు ఆకాశాన్నంటుతున్నాయని పలువురు ఆరోపిస్తున్నారు. ఏజెన్సీల ద్వారా రూ.450లకు సరఫరా అయ్యే గ్యాస్‌ సిలిండర్‌ ధర బ్లాక్‌లో మాత్రం రూ.700 నుంచి రూ.వెయ్యిల పైబడే అమ్ముతున్నారని కొంద రు చెబుతున్నారు. కొంతమంది దళారులు గ్యాస్‌ సిలిండర్‌లను బ్లాక్‌ చేసి వినియోగదారుల అవసరాన్ని బట్టి అధిక ధరలకు అమ్మకాలు చేపడుతున్నారని విమర్శిస్తున్నారు.
అలాగే గృహావసరాలకు వినియోగించవలసిన గ్యాస్‌ సిలిండర్లను వాణిజ్య అవసరాలకు వినియోగిస్తున్నా పట్టించుకునే వారే కరువయ్యారనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. సంబంధిత ఏజెన్సీల సిబ్బంది ప్రమేయంతోనే గ్యాస్‌ సిలిండర్ల బ్లాక్‌ మార్కెట్‌ జోరుగా సాగుతోందని వినియోగదారులు బహిరంగంగానే చెబుతున్నారు.