Server-91
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 14 2014 @ 02:55AM

లారీని ఢీకొన్న కేరళ అంబులెన్స్‌


ఏలూరుక్రైం : ఒక మృతదేహాన్ని కేరళ నుంచి ఒడిశాకు తీసుకువెళుతున్న అంబులె న్సు 16వ నెంబరు జాతీయ రహదారిపై ఆగి ఉన్న ఒక లారీని ఢీకొంది. ఈ ప్రమాదంలో అంబులెన్స్‌లో ఉన్న ఇద్దరు డ్రైవర్లతో పాటు మృతదేహానికి సంబంధించిన ఇద్దరు వ్యక్తులు కూడా గాయాలపాలయ్యారు. కేరళ రాష్ట్రం కొచ్చిన్‌లో ఉన్న ఒక ప్రైవేటు ఆస్పత్రి నుంచి ఒక వ్యక్తి మృతదేహాన్ని అంబులెన్స్‌లో ఉంచి శుక్రవారం ఉదయం ఒడిశా రాష్ర్టానికి బయలుదేరారు. శనివారం ఉదయం మార్గమధ్యలో హనుమాన్‌జంక్షన్‌ సమీపంలో రోడ్డుపై ఆగిఉన్న లారీని అంబులెన్స్‌ ఢీకొంది. ఈ ప్ర మాదంలో అంబులెన్స్‌ డ్రైవరు కేరళరాష్ట్రం కొ చ్చిన్‌ జిల్లా పలారిపట్టంకు చెందిన శ్రీజిత్‌ కలటిల్‌ (27), మరో డ్రైవర్‌ కేరళకు చెందిన బిబిన్‌ వర్గీస్‌ (25), మృతదేహానికి బంధువులైన ఒడిశాలోని వారాకు చెందిన సంతోష్‌ బీసింగ్‌ (42), ప్రశాంత్‌నాయక్‌ (22)లు గా యాలపాలయ్యారు. వీరందరినీ ఏలూరు ప్ర భుత్వాస్పత్రికి తరలించారు. కాగా మృతదేహానికి సంబంధించిన సంతోష్‌ బీసింగ్‌, ప్రశాంత్‌నాయక్‌లు చికిత్స అనంతరం మరో అంబులెన్స్‌లో మృతదేహాన్ని తీసుకుని ఒడిశా వెళ్ళిపోయారు. గాయాలపాలైన ఇద్దరు డ్రైవర్లు ఏ లూరులో చికిత్స పొందుతున్నారు. ఈ సంఘటనపై ఆస్పత్రి వైద్యులు ఎమ్మెల్సీగా నమోదు చేసి, ఆస్పత్రి అవుట్‌పోస్టు పోలీసులకు సమాచారం ఇచ్చారు.