Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 14 2014 @ 02:50AM

కాంట్రాక్టర్లపై దృష్టి పెట్టండి


- సమయానికి పని పూర్తిచేయని
కాంట్రాక్టర్లను బ్లాక్‌ లిస్ట్‌లో పెట్టండి
-ప్రాజెక్టుల ఎలైన్‌మెంట్‌లో మార్పుండదు
- పాత పద్ధతి ప్రకారమే భూసేకరణ
- కలెక్టర్‌ కాటంనేని భాస్కర్‌ సమీక్ష
ఏలూరురూరల్‌ : నిర్ధిష్టమైన సమయానికి పనులు పూ ర్తి చేయని కాంట్రాక్టర్లను బ్లాక్‌ లిస్టులో పెట్టాలని కలెక్టర్‌ ఆదేశించారు. ఏలూరు కలెక్టర్‌ కార్యాలయంలో శనివారం సాగునీటి ప్రాజెక్టు భూసేరణ పనులపై సమీక్షించారు. జిల్లాలో ప్రాజెక్టుల ఎలైన్‌మెంట్‌లో మార్పు ఉండదని, ఒకసారి నిర్ధేశించిన మేరకే ఇరిగేషన్‌ ప్రాజెక్టు కొనసాగుతుందన్నారు. తాడిపూడి లిఫ్ట్‌ ఇరిగేషన్‌కు సంబంధించి కొంతమంది రైతులు ఎలైన్‌మెంట్‌ మార్పు చేయాలని కోరుతున్నారని అది కుదరదని స్పష్టం చేశారు. లిఫ్ట్‌ ఇరిగేషన్‌కు సంబంధించి 34 ఎకరాల భూసేకరణ పనులను వేగవంతం చేయాలని అధికారులకు వివరించారు.భూములకు కొత్త రేట్లు వర్తించవని పాత భూసేకరణ చట్టం ప్రకారమే అమలవుతుందని తెలిపారు. కొత్త దేవరగొందిలో పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల కు నిర్మించిన ఇళ్ళలో ఇతరులు నివాసం ఉండడానికి వీల్లేదని ఆదేశించారు.జిల్లాలో పనులు..కోర్టు కేసులకు సంబంధించిన విషయాలపై హైదరాబాద్‌లో ఉండే లైజాన్‌ ఆఫీసర్‌ రాఘవులు దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టులకు అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల కు భూమికి భూమి పథకం, చింతలపూడి,తాడిపూడి ఎత్తిపోతల పథకం, ఎర్రకాలువ, కొవ్వాడ ప్రాజెక్టు, తదితర ప్రాజెక్టుల భూసేకరణ పనుల వేగవంతానికి వారానికొకసారి సమీక్షలు నిర్వహిస్తానన్నారు.
అడ్వాన్స్‌ రబీకి ప్రణాళిక
జిల్లాలో డెల్టా ఆధునికీకరణ పనులు పూర్తి చేయాల్సిన అవసరం ఉందన్నారు.ఈ మేరకు వచ్చే రబీపంటకు ముం దస్తు ప్రణాళిక సిద్ధం చేయాలని వ్యవసాయ శాఖ జేడీ సత్యనారాయణను ఆదేశించారు.సమావేశంలో ఇరిగేషన్‌ ఎస్‌ ఈ తిరుమలరావు,పోలవరం ఎస్‌ఈ ఎన్‌వి రమణ, ఆర్‌డీ వోలు శ్రీనివాసరావు, ఉదయ్‌భాస్కర్‌రావు, స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్లు, ఇరిగేషన్‌ తదితరశాఖల అధికారులు పాల్గొన్నారు.