Server-91
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 14 2014 @ 02:49AM

ఆధార్‌ అనుసంధానంతో భారీ ఆదా


తణుకు : తణుకు పట్టణ, మండలంలో రేషన్‌ కార్డులు ఆధార్‌ కార్డులు అనుసంధానంతో భారీ ఎత్తున బియ్యం కో టా కేటాయింపులో వ్యత్యాసం వచ్చింది. గత నెలతో పోలిస్తే ప్రస్తుతం నెలలో 752.64 క్వింటాళ్ల బియ్యం ఆదా అయింది. ప్రభుత్వం ఆధార్‌ కార్డు అనుసంధానం చేయించుకునే ప్రక్రియను తప్పనిసరి చేయడంతో అసలు విషయం బయట ప డింది. పట్టణ, రూరల్‌ మండల పరిధిలోని 84 రేషన్‌షాపులు ద్వారా ప్రజలకు నిత్యావసరాలు అందజేస్తున్నారు. చాలా మంది కార్డుదారులు గ్రామాల్లో లేకపోయినప్పటికి వారి కు టుంబీకులు ఇతరులు ఆయా రేషన్‌కార్డుల నుంచి నిత్యావస ర సరుకులు షాపుల నుంచి తీసుకెళ్లే సందర్భాలు ఉండేవి... ఇలా జరగడం వల్ల ప్రభుత్వానికి పెద్దఎత్తున భారంగా ఉం డేది.ప్రస్తుతం రేషన్‌ కార్డులు అనుసంధానం చేయకపోతే భ విష్యత్‌లో రేషన్‌ సరుకులు ఇవ్వరని స్పష్టంగా అధికారులు తెలియజేయడంతో ఎక్కువ మంది రేషన్‌ కార్డులతో ఆధార్‌ నెంబర్లు అనుసంధానం చేయించుకున్నారు. ఈ విఽదానం లో వాస్తవ కార్డుదారులంతా ఆధార్‌ సీడింగ్‌ చేయించుకోవ డం జరిగింది. గ్రామాల్లో లేని వారు కార్డులుకు సంబంధించి ఆధార్‌ సీడింగ్‌ జరగక పోవడంతో అలాంటి కార్డులను జాబితా నుంచి తొలగించడం జరిగింది. అలా తొలగించిన వారికి సంబంధించి బియ్యం భారీ స్థాయిలో ప్రభుత్వానికి ఆదా అ యింది. ఒక వేళ ఆధార్‌ కార్డులు తీయించుకోని వారు, గ్రా మాంతరం వెళ్లిన వారు కార్డులు తొలగిస్తే వారంతా తమ రేషన్‌ కార్డులను, ఆధార్‌ సీడింగ్‌ చేయించుకుంటే తిరిగి పునరుద్ధరించడం జరుగుతుందని అధికారులు చెబుతున్నారు. త ణుకు సంబంధించి ఇప్పటి వరకు 33 వేల 385 రేషన్‌ కార్డులకు గాను 83వేల 855 యూనిట్లు ఆధార్‌ సీడింగ్‌ అయ్యిం ది. 18 వేల 816 యూనిట్లు తొలగించడం జరిగింది. కేవలం 16 వందల 31 యూనిట్లు మాత్రమే సీడింగ్‌ చేయాల్సి ఉం ది. తణుకు పరిధిలోని 84 రేషన్‌షాపులకు సంబంధించి జూలై నెలకు సంబంధించి జిల్లా అధికారులు నాలుగు వేల 554.67 క్వింటాళ్ళ బియ్యం(తెల్లకార్డులు, ఏఏవై, అన్నపూర్ణ, చేనేత కార్మికులు, మత్స్యకారులు)కు సంబంధించి కేటాయించగా ఆగస్టు నెలకు సంబంధించి 4వేల 99.25 క్వింటాళ్ల బి య్యం కేటాయించారు. దీంతో భారీగా బియ్యం ప్రభుత్వానికి ఆదా అయ్యింది. ఇంకా పూర్తి స్థాయి ఆధార్‌ అనుసంధానం పూర్తయితే మరింత ఎక్కువ బియ్యం ఆదా అయ్యే అవకాశా లున్నాయి. ఆధార్‌ అనుసంధానం ద్వారా అసలు లబ్ధిదారుల కే ప్రభుత్వ పథకాలు అందే వీలు కలుగుతుంది.ఈ విధానం వల్ల జిల్లా స్థాయిలో కూడా 700 టన్నులు బియ్యం ఆదా అ యినట్టు అధికారులు చెబుతున్నారు. వాస్తవ లబ్ధిదారుల ఎ వరైనా ఆధార్‌ సీడింగ్‌ చేయించుకోకపోతే అప్పటికైనా ఆధార్‌ సీడింగ్‌ చేయించుకోవాల్సిన అవసరం ఉంది. అలాంటి కార్డు దారులకు తిరిగి రేషన్‌ పునరుద్ధరణ చేయడం జరుగుతుంది. సీఎస్‌, డీటీ డీవీవీ ఎస్‌ అశోక వర్మ తెలిపారు.