Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 14 2014 @ 02:49AM

గీత వృత్తిని రక్షించాలి

ఏలూరు ఫైర్‌స్టేషన్‌ : రాష్ట్రంలో గీత వృత్తి ని రక్షించాలని ఆంధ్రప్రదేశ్‌ కల్లుగీత కార్మిక సంఘ రాష్ట్ర కార్యదర్శి జుత్తిగ నరసింహమూ ర్తి డిమాండ్‌ చేశారు. శనివారం స్థానిక కాశీ విశ్వేశ్వర కళ్యాణ మండపంలో రాష్ట్ర విద్యా, వై జ్ఞానిక, అవగాహన సభలను మాజీ పార్లమెం టు సభ్యుడు మిడియం బాబూరావు ప్రారం భించారు. ఈ సందర్భంగా బాబూరావు మా ట్లాడుతూ రాష్ట్రంలో లిక్కర్‌ ఆదాయాన్ని పెం చుకునేందుకు ప్రభుత్వం గీత వృత్తిని నిర్వీ ర్యం చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. దీని వలన కల్లుగీత కార్మికులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఎన్నికల ముందు వృత్తిదా రుల సంక్షేమానికి 10 వేల కోట్లు కేటాయిస్తా నని టీడీపీ వాగ్దానం చేసిందని, అధికారంలోకి వచ్చిన తరువాత గీత కార్మికుల సంక్షేమం మాటే మరచిపోయిందని ఆగ్రహం వ్యక్తం చే శారు. రాష్ట్రంలో 22 వేల మందికి పెన్షన్లు ఇ స్తామని ప్రకటించిందని, ఆచరణలో ఇంతవ రకు పెన్షన్లు ఇవ్వడం సాధ్యంకాలేదన్నారు. న రసింహమూర్తి మాట్లాడుతూ మారుతున్న ప రిస్థితులకు అనుగుణంగా గీత వృత్తిలో నూత న టెక్నాలజీని తీసుకురావాలని విజ్ఞప్తి చేశా రు. కార్యక్రమంలో రాష్ట్ర కన్వీనర్‌ పి.జమల య్య, రాష్ట్ర అధ్యక్షుడు చల్లారి సుబ్బారావు త దితరులు పాల్గొన్నారు.