Server-91
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 14 2014 @ 02:47AM

సందడే.. సందడి


కాణిపాక ప్రత్యేక ఉత్సవాల్లో అలరించిన కళాకారుల ప్రదర్శనలు
ఐరాల(కాణిపాకం): పుష్పపల్లకి సేవను పురస్కరించుకొని శనివారం కాణిపాకంలో పలువురు కళాకారుల ప్రదర్శనలు భక్తులకు అలరించాయి. ఇందులో భవిర రవి చేసిన ఆకట్టుకుంది. కాగా, ఉదయం 10 నుంచి 12 గంటల వరకు ఈశ్వరి ధార్మికోపన్యాసం, మధ్యాహ్నం 12 నుంచి 2 వరకు చౌడేపల్లెకు చెందిన భాగవతాణి రాధిక హరికథ, మధ్యాహ్నం 2 నుంచి 4 వరకు చిత్తూరుకు చెందిన సుందరవాసుదేవన్‌ భక్తిపాటలు, 4 నుంచి 6 వరకు తిరుపతి శశిధర్‌ భరతనాట్యం, 6 నుంచి 8 వరకు కర్నూల్‌కు చెందిన నాగసాయిప్రదీప్‌ భరతనాట్యం, భక్తిగీతాలు, 8 నుంచి 9 వరకు భవిరిరవి మిమిక్రీ, అనంతపురానికి చెందిన రేలారేలారే జానపద గేయాలు, 9 నుంచి 12 వరకు గుంటూరుకు చెందిన శివశక్తి నాట్యమండలి, 12 నుంచి 4 వరకు కసాపురానికి చెందిన ఆదినారాయణ బృందం ఆధ్వర్యంలో పౌరాణిక నాటక ప్రదర్శనలు నిర్వహించారు.
నేటి సాంస్కృతిక కార్యక్రమాలివీ..
ప్రత్యేక ఉత్సవాలలో భాగంగా ఆదివారం ఉదయం 10 నుంచి 12 గంటల వరకు చిత్తూరుకు చెందిన మునస్వామి ధార్మికోపన్యాసం, మధ్యాహ్నం 12 నుంచి 2 వరకు నెల్లూరుకు చెందిన భాగవతాణి భవాని హరికథ, 2 నుంచి 4 వరకు చిత్తూరుకు చెందిన భావన భక్తిపాటలు, 4 నుంచి 6 వరకు విశాఖపట్టణానికి చెందిన ఆకెళ్ళ భారతి భరతనాట్యం, 6 నుంచి 8 వరకు హైదరాబాద్‌కు చెందిన భాగ్యవతి, తిరుపతికి చెందిన ఉషారాణి భరతనాట్యం, భక్తిగీతాలు, రాత్రి 8 నుంచి 9 వరకు చెన్నైకి చెందిన అఖిలాండేశ్వరి మిమిక్రీ, జానపద గేయాలు, 9 నుంచి 12, 12 నుంచి 4 వరకు శాక్సాఫోన్‌ కచేరి నిర్వహించనున్నారు.
ఆకట్టుకున్న అలంకరణలు
శనివారం స్వామికి పుష్పపల్లకి సేవ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వరసిద్ధుడి ఆలయాన్ని సుందరంగా ముస్తాబు చేశారు. ప్రధాన ఆలయం, అర్థ, మూషిక, అణివేటి, సుపధ మండపం, స్వర్ణధ్వజ స్తంభాన్ని పలురకాల పుష్పాలతో శోభాయమానంగా తీర్చిదిద్దారు. ఆలయ అణివేటి మండపంలో పుష్పాలతో అలంకరించిన పవళింపు వినాయకుడు, ముంతమామిడితో రూపొందించిన మహాగణపతి భక్తులను ఆకట్టుకుంది.
గణనాథుడి సేవలో సెంట్రల్‌ ట్రిబ్యునల్‌ సభ్యుడు
వరసిద్ధ వినాయకస్వామిని సెంట్రల్‌ ట్రిబ్యునల్‌ సభ్యుడు అజయ్‌కుమార్‌, ఎమ్మెల్యే సునీల్‌కుమార్‌ దర్శించుకున్నారు. ఆలయ ఈవో పూర్ణచంద్రరావు వారిని ఆహ్వానించి స్వామి దర్శన ఏర్పాట్లను చేశారు. అనంతరం ప్రముఖులను ఆలయ మూషిక మండపంలో అర్చకులు వేదమంత్రాలతో ఆశీర్వదించి స్వామి శేషవస్త్రాలను అందజేశారు. కార్యక్రమంలో ఆలయ ఏఈవో ఎన్‌ఆర్‌కృష్ణారెడ్డి, సూపరింటెండెంట్‌ రవీంద్రబాబు, నాయకులు మోహన్‌రెడ్డి, చిన్నారెడ్డి, భాస్కరయ్య, ఎన్‌.గణపతి పాల్గొన్నారు.