Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 14 2014 @ 02:45AM

రాజీవ్‌నగర్‌లో ఇళ్ల సర్వే ఎందుకాగినట్టో?

శ్రీకాళహస్తి: పురపాలక సంఘ పరిధిలోని రాజీవ్‌నగర్‌లో జరిగిన అక్రమాలపై చేస్తున్న విచారణను అధికారులు అర్ధంతరంగా ఆపేశారు. రాజీవ్‌నగర్‌లో ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయి. ఈ అక్రమాలపై ఆంధ్రజ్యోతిలో ఇటీవల ‘అక్రమాలకు అడ్డా’ అనే శీర్షికన కథనం ప్రచురితమైంది. దీంతో కలెక్టరు స్పందించారు. దీనిపై విచారణ జరిపి ఆగస్టు 23లోగా నివేదిక ఇవ్వా లని ఆదేశించారు. ఈ మేరకు రెవెన్యూ, పురపాలక, గృహనిర్మాణశాఖ సిబ్బంది 15 బృందాలు గా విడిపోయి విచారణ చేపట్టారు. ఈ బృందా లు మొదట రాజీవ్‌నగర్‌లో ఎన్ని ఇళ్లు నిర్మించారు? పట్టా ఎవరి పేరున ఉంది? అర్హులా? కాదా? ఇంకా ఎన్ని ప్లాట్లు ఖాళీగా ఉన్నాయనే అంశాలపై విచారణ చేశారు. ఆ తరువాత లబ్దిదారుల ఇళ్ల వద్దకే వెళ్లి ఆధారాలు సేకరించారు. విచారణ మరో రెండు, మూడు రోజుల్లో ముగుస్తుందని అందరూ భావించారు. అయితే అధికారులు ఈ విచారణ ఎలాంటి సమాచారం లేకుండానే ఆపేశారు. గతంలో కూడా ఇలాగే విచారణ జరిపి నివేదికలు అందచేసినా... ఎలాంటి చర్యలు తీసుకోలేదు. విచారణ పూర్తి చేస్తే పేదలకు న్యాయం జరుగుతుంది. కలెక్టరు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాల్సి ఉంది.