Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 14 2014 @ 02:45AM

25 నుంచి ముక్కంటి ఆలయంలో దసరా ఉత్సవాలు


శ్రీకాళహస్తి: వాయులింగేశ్వరుడి క్షేత్రంలో ఈనెల 25 నుంచి దసరా ఉత్సవాలు నిర్వహించనున్నారు. దసరా సందర్భంగా యేటా ఈ ఆలయంలో ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తారు. 25న దసరా ఉత్సవాలకు కలశ స్థాపన చేస్తారు. జ్ఞాన ప్రసూనాంబ అమ్మవారు 26న మహా విష్ణు అవతారం, 27న తపస్సమ్మ, 28న ప్రత్యక్ష అవతారం, 29న అశ్వాసుర వధ, 30న వ్యాఘ్రాసుర వధ, 1న రక్త బీజాక్షరి, బండాసురవధ, 2న ఆయుధపూజ, మహిసాసురవధ అవతారాల్లో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. 3న విజయదశమి, పార్వేట ఉత్సవం నిర్వహిస్తారు.