Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 14 2014 @ 02:44AM

టీ-20 క్రికెట్‌ జిల్లా జట్టు ఎంపిక


తిరుపతి క్రీడలు: రాష్ట్ర ట్వంటీ-20 క్రికెట్‌ సంఘం ఆధ్వర్యంలో శనివారం స్థానిక నెహ్రూ మున్సిపల్‌ హైస్కూల్‌ క్రీడా మైదానంలో టీ-20 జిల్లా జట్టును ఎంపిక చేశారు. ఈ జట్టు ఈ నెల 20 నుంచి 22వ తేదీవరకు తిరుపతిలో జరిగే అంతర్‌ జిల్లాల టీ-20 క్రికెట్‌ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొంటుందని ఆ సంఘం ప్రఽధాన కార్యదర్శి డాక్టర్‌ టి.హరిబాబు తెలిపారు.
ఎంపికైన క్రీడాకారులు: గాలి జగదీష్‌సాయి (కెప్టెన్‌), టి.దినేష్‌, ఆర్‌.ధీరజ్‌, విష్ణుగణేష్‌, ధనుష్‌కుమార్‌, బి.మహేష్‌, సి.బాలాజీ, బి.పార్థసారథి, వి.రెడ్డిశేఖర్‌, వి.మహేంద్ర, విశ్వనాథ్‌, కె.కుమార్‌, శివకిషోర్‌, డీఆర్‌ గౌతమ్‌.