Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 14 2014 @ 02:43AM

ముగ్ధమనోహరా పాహిమాం!

ఐరాల(కాణిపాకం): కాణిపాక ఆలయ ప్రత్యేక ఉత్సవాల్లో భాగంగా శనివారం శివపుత్రుడు పుష్పపల్లకిపై వైభవంగా విహరించారు. ఈ సందర్భంగా ఉదయం ఉభయదారుల ఆధ్వర్యంలో అర్చకులు మూలవిరాట్‌కు చందాభిషేకం నిర్వహించారు. దాదాపు 40 కేజీల శుద్ధ చందనంతో స్వామికి ప్రత్యేక అలంకారం చేశారు. అనంతరం సుందరంగా ముస్తాబు చేసిన వినాయస్వామి భక్తులకు దర్శనమిచ్చారు. రాత్రి ఉభయదారులు ఉభ య వరసను తీసుకురాగా, ఆలయ అలంకార మండపంలో ఉత్సవ విగ్రహాలకు విశేష పూజలు జరిపారు. తర్వాత సర్వాలంకారుడైన సిద్ధి, బుద్ధి సమేత వరసిద్ధుడు పుష్పపల్లకిపై కొలువుదీర్చారు. భాజా బజంత్రీలు, మేళతాళాలు, కళాకారుల సందడి నడుమ పురవీధు ల్లో స్వామి ఘనంగా ఊరేగారు. ఈ కార్యక్ర మంలో అలయ ఈవో పూర్ణచంద్రరావు, ఏసీ వెంకటేష్‌,ఏఈవో ఎన్‌ఆర్‌కృష్ణారెడ్డి, సూపరిం టెండెంట్‌ రవీంద్రబాబు, ఆలయ ఇన్‌స్పెక్టర్‌ మునిరత్నం తదితరులు పాల్గొన్నారు.
భారీగా తరలి వచ్చిన భక్తులు
పుష్పపల్లకి సేవ సందర్భంగా స్వామిని దర్శించుకొనేందుకు జిల్లా నలుమూలల నుంచి భారీగా భక్తులు కాణిపాకం తరలి వచ్చారు. రద్దీ కారణంగా క్యూలైన్లు నిండడంతో అధికారులు లఘు దర్శనాన్ని ఏర్పాటు చేశారు. కాగా, పుష్పపల్లకి సేవకు సేలం, ధర్మపురి, కుప్పం, బెంగుళూరు నుంచి 750 కేజీల పుష్పాలను తెప్పించారు. మల్లీ, జాజి, సంపంగి, డేరా, బొండుమల్లి, రోజా, కనకాంబరం పుష్పాలతో పల్లకిని సుందరంగా తీర్చిదిద్దారు. పల్లకిపై మహా గణపతి, గుర్రాలు, చెలికత్తెలు తదితర ప్రతిమలను జోడించడం ఆకట్టుకుంది.
నేడు కామధేను వాహన సేవ
ప్రత్యేక ఉత్సవాల్లో భాగంగా ఆదివారం కామధేను వాహన సేవను నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి కాణిపాకానికి చెందిన నాయీబ్రాహ్మణ వంశస్థులు ఉభయదారులుగా వ్యవహరించనున్నారు.