Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 14 2014 @ 02:43AM

ఎంఈవోపై తక్షణం విచారణ చేపట్టాలి

మదనపల్లెరూరల్‌: ఎమ్మార్సీకి విడుదల చేసిన నిఽధులను దుర్వినియోగం చేసిన మదనపల్లె ఎంఈవో శ్రీదేవిపై తక్షణం విచారణ చేపట్టాలని పీఆర్‌టీయూ నాయకులు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులునాయుడుకు వినతిపత్రం సమర్పించారు. స్థానిక హోప్‌స్కూల్‌లో జరిగిన సమావేశానికి వచ్చిన పీఆర్‌టీయూ రాష్ట్ర అఽఽధ్యక్ష, ప్రధానకార్యదర్శులు కమలాకర్‌, బి.అప్పారావుల సమక్షంలో ఎమ్మెల్సీకి వినతి పత్రం సమర్పించిన పీఆర్‌టీయూ నాయులు మాట్లాడుతూ 2012-13 సంవత్సరంలో విడుదలైన మధ్యాహ్నబోజన నిధులు వినియోగంలో, 2013-14 మధ్యాహ్నబోజన కంటెజెన్సీ నిధుల వినియోగంలో ఎంఈవో అక్రమాలకు పాల్పడ్డారన్నారు. అంతేకాక సీఆర్‌సీల నుంచి రూ.500 చొప్పున వసూలుచేశారని, ఆమెకు అనుకూలంగా వున్న ఉపాధ్యాయులకు ఈఎల్‌ మంజూరు చేస్తూ మిగిలిన వారిని కక్షసాధింపు చర్యలు చేపడుతున్నారన్నారు. ఈ విషయమై జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేయగా ఎంఈవోపై వచ్చిన ఆరోపణలపై విచారణ జరపాల్సిందిగా మదనపల్లె డీవైఈవోను ఆదేశిస్తూ డీఈవో ప్రతాపరెడ్డి ఉత్తర్వులు జారీ చేశారన్నారు. ఇది జరిగి రెండునెలలు గడుస్తున్నా..ఇంత వరకు ఎంఈవోపై విచారణ చేయలేదన్నారు. దీనిపై విద్యాశాఖ కమిషనర్‌, పాఠశాల విద్యా రాష్ట్రసంచాలకులకు ఎమ్మెల్సీ ద్వారా ఒత్తిడి తెచ్చి మదనపల్లె విద్యాశాఖలో జరిగే అక్రమాలకు చెక్‌పెట్టాలని కోరారు. కార్యక్రమంలో పీఆర్‌టీయూ డివిజనల్‌ కన్వీనర్‌ జయరాజ్‌, ఎం.సిద్దయ్య, ఆనందనాయుడు, గుర్రప్పనాయుడులు పాల్గొన్నారు.