Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 14 2014 @ 02:43AM

బంగారు తెలంగాణకు తోడ్పడండి!


ఎస్సీలకు భూపంపిణీలో కేంద్ర భాగస్వామ్యం
సీడ్‌ బౌల్‌ ఏర్పాటుకు సహకరించండి
వెనుకబడిన 8 జిల్లాలకు అభివృద్ధి నిధులు
19న ఆర్థిక సంఘంతో భేటీలో తెలంగాణ ప్రతిపాదనలు
ఫలక్‌నుమాలో 18న సంఘ సభ్యులకు విందు

(హైదరాబాద్‌, ఆంధ్రజ్యోతి): కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా తీర్చిదిద్దేందుకు తాము చేపట్టిన బృహత్కార్యానికి కేంద్రం నుంచి ఇతోదిక సాయాన్ని కోరాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోది. ఇటీవల చేపట్టిన పలు పథకాల అమలుకు కూడా కేంద్రం నుంచి సహకారాన్ని అర్థించాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఈ నెల 19న 14వ ఆర్థిక సంఘంతో జరగనున్న భేటీలో ఈ మేరకు ప్రతిపాదించేందుకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఈ నెల 18న రిజర్వ్‌ బ్యాంక్‌ మాజీ గవర్నర్‌ వైవీ రెడ్డి నే తృత్వంలోని 14 వ ఆర్థిక సంఘం హైదరాబాద్‌ రానుంది. అదే రోజు రాత్రి నగరంలోని ఫలక్‌నూమా ప్యాలెస్‌లో ఆర్థిక సంఘం సభ్యులకు తెలంగాణ సర్కారు విందు ఏర్పాటు చే సింది. ఈ నెల 19న ఆర్థిక సంఘంతో తెలంగాణ సీఎం కేసీఆర్‌, మంత్రివర్గ సహచరులు, ఉన్నతాధికారులతో కలిసి భేటీ కానున్నారు. ఈ సందర్భంగా ఆర్థిక సంఘం ముందు ఏఏ ప్రతిపాదనలు పెట్టాలి, ఎంత మేర నిధులను అభ్యర్థించాలి అన్న విషయాలను ఖారారు చే సే బాధ్యతను సీఎం, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌ శర్మపై పెట్టారు. సీఎం ఆదేశాలతో రంగంలోకి దిగిన శర్మ, శనివారం ఆర్ధిక శాఖ ముఖ్య కార్యదర్శి వి. నాగిరెడ్డి, ప్రత్యేక కార్యదర్శి కె. రామకృష్ణారావు, ప్రణాళిక శాఖ ముఖ్య కార్యదర్శి బి.పి. ఆచార్య, ఆర్ధిక శాఖ సలహాదారుడు జి.ఆర్‌.రెడ్డి తదితరులతో సమావేశమయ్యారు. ఈ భేటీలో పలు అంశాలపై ఉన్నతాధికారులు సుదీర్ఘంగా చర్చలు నిర్వహించారు. కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ ను అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపి, బంగారు తెలంగాణను నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ముందుకెళుతోంది. ఈ నేపథ్యంలో, ఆ బృహత్కార్యానికి కేంద్రం నుంచి భారీ ప్యాకేజీ కోరాలని ప్రభుత్వం యోచిస్తోంది. అంతేకాక ఆగస్టు 15న రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభించిన ఎస్సీలకు భూ పంపిణీ పథకంలో కేంద్రం భాగస్వామ్యం తీసుకోవాలని కూడా ప్రతిపాదించేందుకు సిద్ధమవుతోంది. ప్రతి ఎస్సీ కుటుంబానికి మూడెకరాల చొప్పున భూమి పంపిణీ చేయడమే కాక, సదరు భూమిని సాగులోకి తెచ్చేందుకు అవసరమైన సహకారాన్ని కూడా అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని వెల్లడించనుంది.
ఎస్సీల జీవితాల్లో వెలుగు నింపనున్న ఈ పథకానికి ఆర్థిక సహాయంతో సరిపెట్టకుండా, కేంద్రం భాగస్వామ్యం తీసుకుంటే బాగుంటుందని ప్రతిపాదించనుంది. ఇక విత్తనాభివృద్ధికి దేశంలోనే అత్యంత అనుకూలంగా ఉన్న తెలంగాణను ‘‘సీడ్‌ బౌల్‌ ఆఫ్‌ ఇండియా’’గా మారుస్తామని, అందుకు కేంద్రం భారీగానే సాయం చేయాలని కోరాలని యోచిస్తోంది. హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాలు మినహా మిగిలిన ఎనిమిది జిలాలు వెనుకబడినవేనని, వాటికి అభివృద్ధి ప్యాకేజీ ప్రకటించాలని కోరనుంది. మరోవైపు రాష్ట్ర తలసరి ఆదాయాన్ని పరిగణనలోకి తీసుకునే సమయంలో వెనుకబడిన ఈ ఎనిమిది జిల్లాల గణాంకాలను పరిగణనలోకి తీసుకోవాలని కూడా ఆర్థిక సంఘానికి తె లంగాణ సర్కారు ప్రతిపాదించనుంది. కేంద్రం నుంచి అందాల్సిన గ్రాంట్‌లను త్వరితగతిన విడులయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరడంతో పాటు కేంద్రానికి రాష్ట్రం చెల్లించాల్సిన బకాయిలను రద్దు చేయాలని కూడా కేసీఆర్‌, ఆర్థిక సంఘానికి విన్నవించనున్నారు. వివిధ అంశాలకు సంబంధించిన ప్రతిపాదనలను పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ రూపంలో కేసీఆర్‌, ఆర్థిక సంఘం సభ్యులకు వివరించనున్నారు.