Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 14 2014 @ 02:42AM

కేసీఆర్‌కు సిగ్గుంటే ముక్కు నేలకు రాయాలి


మంద కృష్ణ మాదిగ వ్యాఖ్య
ఖమ్మం, సెప్టెంబర్‌ 13(ఆంధ్రజ్యోతి): దళితుడిని సీఎం చేస్తానని నమ్మించి మోసం చేసినందుకు కేసీఆర్‌ ముక్కు నేలకు రాయాలని మహాజన సోషలిస్టు పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ డిమాండ్‌ చేశారు. శనివారం ఖమ్మంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మోసపూరితంగా సీఎం అయిన ఆయన ఉన్నంత కాలం ప్రతి రోజు దళితులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. కేసీఆర్‌ పరిపాలనే మోసాలతో మొదలైందన్నారు. నర్సాపూర్‌ ఎన్నికల సమావేశంలో అబద్ధాలు ఆడనని చెప్పడమే ఒక పెద్ద అబద్ధమన్నారు. ఆయనకు అబద్ధాలు చెప్పడం కొత్తెమీ కాదని, తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా దళితుణ్ణి చేస్తానని వేలసార్లు చేప్పారన్నారు. రోజూ మాట తప్పేవారికి ఇచ్చిన మాటలేమి గుర్తుంటాయని ఎద్దేవా చేశారు. డిప్యూటీ సీఎం రాజయ్య దళితజాతికి చెందిన వాడనే అవమానపాలు చేశారన్నారు. రాజయ్యకు క్షమాపణ చెప్పాలన్నారు. రాజయ్యను తొలంగించేందకు ప్రయత్నిస్తే సహించేది లేదన్నారు అక్టోబర్‌ నుంచి సమస్యలపై మరో పోరాటానికి సిద్ధం కానున్నట్లు తెలిపారు.