Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 14 2014 @ 02:42AM

‘ఉపాధి’ కరువు


కనిగిరి: ఉపాధి హామీ పథకం ఆశయం నీరుగారుతున్నది. కూలీల వలసలు నివారిం చేందుకు అమలుచేస్తున్న పథకం వాటికి అడ్డు కట్ట వేయలేకపోతున్నది. ఇందుకు అధికారులు నిర్లక్ష్యం ప్రధాన కారణమవుతోంది. ఉపాధి కరు వై పొట్ట చేత పట్టుకుని కూలీలు వలసలు పో తున్నారు. కేటాయింపులకు సంబంధించి ఆర్థిక సంవత్సరం ముగిసి ఆరు నెలలు దాటినా నామమాత్రంగానూ పనులు జరగడం లేదు. కనీసం ఇరవై శాతం లోపు మాత్రమే పనులు పూర్తి, కేటాయింపులు వ్యయం కనిపిస్తున్నది. దీంతో జిల్లాలో ఈ పథకం పనితీరు ఎలా సాగుతుందో ఇట్టే అర్థమవుతోంది. ఏదైనా ఒక గ్రామంలో పనులు పురోగతి కాగితాల మీద కని పించినా వాస్తవంలో జరగని పరిస్థితి. లక్ష్యాల మేర పనులు చేపట్టకపోగా బిల్లులు మంజూ రులోనూ తీవ్రంగా జాప్యం జరుగుతోంది.
వ్యవసాయ పనులు, ఉపాధి లేక...
వర్షాభావంతో వ్యవసాయ పనులు, ఉపాధి పనులు జరుగక కూలీల పరిస్థితి రెంటికి చెడ్డరేవడిలా తయారైంది. జిల్లాలో ఎన్‌ఆర్‌జీఎస్‌ అధికారుల లెక్కల ప్రకారం ఈ ఏడాది కేటాయింపులు రూ.11 వందల కోట్లు కాగా ఆర్థిక సంవత్సరం దాటి ఆరు నెలలు ముగియగా రూ.160 కోట్లు మాత్రమే వ్యయం చేశారు. 91 వేల పనులు గుర్తించగా ఇప్పటివరకు 36 వేల పనులు మాత్రమే పూర్తయ్యాయి. జిల్లాలో ఉపాధి పని కుటుంబాలు 2.97 లక్షలు ఉండగా, ఉపాధి పత్రాలు పొందిన వారు 6.92 లక్షలు మంది ఉన్నారు. వేసవిలో పనిపొందుతున్న కూలీలు నాలుగు లక్షల మంది ఉండగా, ప్రస్తుతం పనిచేస్తున్న కూలీలు పదివేల మందిలోపు ఉన్నారు. కనిగిరి ప్రాంతంలో నామమాత్రంగానూ పనులు జరుగడం లేదు. ఈ ఏడాది కొత్తగా మంజూరైన ఉపాధి పనుల్లో అధికంగా ఎస్సీ, ఎస్టీ, బీసీలకు చెందిన బీడు భూములు బాగు చేయటం, నీటి పారుదల కాలువలు, చెరువుల్లో, కుంటల్లో పూడికతీత, గ్రా మాల్లో లింక్‌ రోడ్డు నిర్మాణం పనులు చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. అయితే ఈ పనులు వేగవంతంగా సాగడం లేదు.
తొలగని సందిగ్దం
ఉపాధి హామీ పథకంలో కొనసాగుతున్న ఫీల్డు అసిస్టెంట్ల నియామకం పట్ల సందిగ్దత కొనసాగుతున్నది. పనులు సాగకపోవడానికి ఈ సమస్య ప్రధాన కారణమైంది. గత ఏడాది వార్షిక బడ్జెట్‌లో 75 శాతానికి పైగా పనులు చేసిన క్షేత్రసహాయకులను మాత్రమే కొనసాగించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేశారు. గతంలో జిల్లాలో 1028 గ్రామ పంచాయతీలు ఉండగా 854 మంది క్షేత్రసహాయకులు ఉన్నారు.75 శాతం పనులు పూర్తి చేసిన వారి కింద ప్రభుత్వ ఆదేశాల ప్రకారం 345 మంది మాత్రమే కొనసాగుతుండగా, 509 మందిని తొలగించారు. కనిగిరి నియోజకవర్గంలోని ఆర ుమండలాల్లో 135 గ్రామ పంచాయతీల్లో 134 మంది ఫీల్డు అసిస్టెంట్లకు గాను 91 మందిని తొలగించగా 43 మంది మాత్రమే ఉన్నారు. దీంతో గ్రామాల్లో పనులు చేయుంచేవారు కరువయ్యారు.
ఉపాధి లేక వలసలు
కనిగిరి ప్రాంతంలో సాధారణంగా వలసలు తీవ్రంగా ఉంటాయి. ఈ ఏడాది వర్షాలు లేక పంటలు సాగుకాక వ్యవసాయ పనులు లేక పోవడం, ఉపాధి పనులు జరగకపోవడంతో కూలీలు పెద్ద ఎత్తున వలసలు పోతున్నారు. జరిగిన అరకొర ఉపాధి పనుల్లో కూలీ గిట్టు బాటు కాకపోవడంతో మందుకు రావడం లేదు. క్షేత్రసహాయకులు లేకపోవటం, కొన్ని గ్రామాల్లో టెక్నికల్‌ సిబ్బందికి అప్పగించడంతో చేసిన పనికి చెల్లింపులు ఎవ్వరు ఇస్తారనేది సృష్టత లేక కూలీలు పనులు చేయటానికి ముం దుకు రావడం లేదు. ఉపాధి పనులు కన్నా వల సలే మేలని ఆ దిశగా కూలీలు సాగుతున్నారు.
ఫీల్డు అసిస్టెంట్లు లేకపోవడమే కారణం
- ఏపీడీ కృష్ణారావు
75 శాతం పనులు చేసిన వారినే ఫీల్డు అసిస్టెంట్లుగా కొనసాగించడంతో పనులు మం దకొడిగా సాగుతున్నాయి. ఫీల్డుఅసిస్టెంట్లు లేని గ్రామాలకు టెక్నికల్‌ అసిస్టెంట్లను నియమంచి ఉపాధి పనులు కొనసాగిస్తున్నాం