desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 14 2014 @ 02:42AM

సర్వీస్‌ రూల్స్‌ విడుదల చేయాలి


తెలంగాణ సీఎం, విద్యామంత్రికి పీఆర్‌టీయూ టీఎస్‌ విజ్ఞప్తి
హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 13 (ఆంధ్రజ్యోతి) : కొన్నేళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఉపాధ్యాయుల సర్వీస్‌ రూల్స్‌ను రూపొందించి, విడుదల చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి పీఆర్‌టీయూ టీఎస్‌ విజ్ఞప్తి చేసింది. యూనియన్‌ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పేరి వెంకటరెడ్డి, పి.సరోత్తం రెడ్డి, ఎమ్మెల్సీలు కె.జనార్దన్‌రెడ్డి, పూల రవీందర్‌, మాజీ ఎమ్మెల్సీ, ఏఐటీఓ చైర్మన్‌ బి.మోహన్‌రెడ్డి శనివారం ముఖ్యమంత్రి కేసీఆర్‌, విద్యా మంత్రి జగదీశ్‌రెడ్డిలను కలిసి ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. గత ప్రభుత్వాలు సర్వీస్‌ రూల్స్‌ విషయాన్ని పట్టించుకోలేదని తెలిపారు. తక్షణమే సర్వీస్‌ రూల్స్‌ రూపొందించి విద్యారంగాన్ని పటిష్ఠ పరచాలని కోరారు. తమ సమస్యలు సీఎం సావధానంగా విన్నారని, విజయదశమిలోగా అన్ని సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారని వారు ఒక ప్రకటనలో తెలిపారు. కాగా, టీపీఆర్‌టీయూ వరంగల్‌ జిల్లా శాఖ శనివారం పీఆర్‌టీయూ టీఎస్‌లో విలీనమైందని ఆ యూనియన్‌ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పేరి వెంకటరెడ్డి, పి.సరోత్తం రెడ్డి తెలిపారు.