Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 14 2014 @ 02:42AM

సమస్యలను పరిష్కరించండి: ఎస్‌టీఎఫ్‌


హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 13 (ఆంధ్రజ్యోతి): అపరిష్కృతంగా ఉన్న ఉపాధ్యాయుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్‌ ఉపాధ్యాయుల ఫెడరేషన్‌ (ఎస్‌టీఎఫ్‌) రాష్ట్ర అధ్యక్షుడు కందుల యోగీశ్వర్‌ డిమాండ్‌ చేశారు. శనివారం జరిగిన కర్నూలు జిల్లా కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఏకీకృత సర్వీసు నిబంధనలు, 63శాతం ఫిట్‌మెంట్‌తో పీఆర్సీ, పాత వేళల్లోనే పాఠశాలలు కొనసాగింపు, ఉపాధ్యాయుల బదిలీలకు షెడ్యూలు ప్రకటించటం లాంటి డిమాండ్లను వెంటనే నెరవేర్చాలని కోరారు.