Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 14 2014 @ 02:42AM

గ్రామాల్లోకి వెళ్లండి.. సమస్యలు పరిష్కరించండి


ఒంగోలు కార్పొరేషన్‌: ‘‘ప్రజల సంక్షే మం కోసం ప్రభుత్వం ప్రత్యేక కార్యా చరణ చేపట్టింది. అందుకోసం పలు పథకాలకు శ్రీకారం పలికింది. అధికా రులు కార్యాలయాలకే పరిమితం కా కుండా గ్రామస్థాయిలో పర్యటించాలి’’ అని రాష్ట్ర రోడ్లు, భవనాలు, రవాణా శాఖ మంత్రి శిద్దా రాఘవరావు అధి కారులను ఆదేశించారు. శనివారం ఒ ంగోలులోని తన నివాసంలో మంత్రి శిద్దా ఇరిగేషన్‌, వ్యవసాయ శాఖ, హౌసింగ్‌, విద్యుత్‌ శాఖ అధికారులతో ప్రత్యేకంగా సమీక్ష సమావేశం నిర్వ హించారు. ఈ సందర్భంగా మంత్రి శి ద్దా మాట్లాడుతూ ముఖ్యంత్రి చంద్ర బాబు నాయుడు ప్రజల కోసం ప్రతి నిత్యం కష్టపడుతున్నారని, ప్రభుత్వ అధికారులుగా బాధ్యతగా వ్యవహరిం చాలని వారికి సూచించారు. ప్రతి అ ధికారి గ్రామాల్లో పర్యటించాలని, ప్ర జల సమస్యలను నేరుగా తెలుసుకుని వాటి పరిష్కారానికి తగు చర్యలు తీ సుకోవాలని ఆదేశించారు. అధికారుల పరిధిలో లేని సమస్యలను తన దృ ష్టికి తీసుకురావాలని మంత్రి పేర్కొ న్నారు. పురాతన పద్దతులు కాకుండా అతి తక్కువ సమయంలో ఆదాయ వనరులుగా ఉండే పంటలపై అవగా హన కల్పించాలని వారికి ఆదేశించా రు. అంతేగాకుండా సాగుకు అవసర మైన నీరు పుష్కలంగా ఉన్నందున తగు విధంగా రైతులను చైతన్య పర చాలని ఆయన చెప్పారు. మొక్కజొ న్న, గులాబీ మొక్కల సాగువంటివి ఎక్కువ ప్రయోజనం చేకూరుస్తాయ ని తెలిపారు. మరోసారి సమీక్ష నిర్వ హించే సమయానికి ప్రస్తుత సమీక్ష అంశాలు పురోగతి చూపాలని మంత్రి శిద్దా ఆదేశించారు.