Server-91
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 14 2014 @ 02:41AM

బాలయ్య సహకారంతో నియోజకాభివృద్ధికి కృషి

కనిగిరి ఎమ్మెల్యే కదిరి బాబూరావు
వెలుగొండ త్వరితగతిన పూర్తికి సీఎం హామీ ఇచ్చారని వెల్లడి
సీఎస్‌పురం: తన మిత్రుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సహాకారంతో నియోజకవర్గ అభివృద్దికి కృషి చేస్తున్నట్లు కనిగిరి ఎమ్మెల్యే కదిరి బాబూరావు పేర్కొన్నారు. శనివారం సీఎస్‌పురం మండల పరిషత్‌ సర్వసభ్య సమావేశం స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ పెదఅల్లూరయ్య అధ్యక్షతన జరిగింది. ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే కదిరి మాట్లాడుతూ బాలకృష్ణ సహాకారంతోనే కనిగిరిలో జాతీయ పెట్టుబడులు, ఉత ్పత్తి జో న్‌ మంజూరు చేయించామని, దీనిద్వారా సు మారు 15వేల మంది వరకు ఉద్యోగావకాశాలు దక్కుతాయని చెప్పారు. ప్రభుత్వ జూనియర్‌ కళాశాల, ఏపీ రెసిడెన్సియల్‌ స్కూల్‌ మంజూరుకు మంత్రి గంటా శ్రీనివాస్‌తో మాట్లాడినట్లు ఆయన తెలిపారు. అధికారులు రాజకీ యం చేయకుండా తమ బాధ్యతలు సక్రమం గా నిర్వహించాలని, రాజకీయాలపై శ్రద్ధ ఉన్న ఉద్యోగాలకు రాజీనామా చేసి రాజకీయాలు చేయవచ్చని హితవు పలికారు.పార్టీ ఎదైనా ఉ పాధ్యాయులు పాఠశాలలకు సక్రమంగా వెళ్లక పోతే చర్యలు తీసుకోవాలని ఎంఈవోను ఎమ్మె ల్యే ఆదేశించారు. మండలంలో శాశ్వత మంచినీటి పరిష్కారానికి రామతీర్ధం నుంచి నీరు అందించేందుకు రూ.55కోట్లతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు. ఈ సం దర్భంగా బెల్ట్‌ షాపులు ఉన్నాయని సభ్యులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా వెంటనే కనిగిరి ఎక్సైజ్‌ సీఐకు ఫోన్‌ చేశారు. నియోజకవర్గంలో బెల్ట్‌ షాపులు నిర్వహిస్తే సహించేదిలేదని, దీ నిపై ఎన్నిసార్లు చెప్పాలని, ఇష్టంలేకపోతే బదిలీపై వెళ్ళవచ్చని ఫోన్లోనే హెచ్చరించారు. అం గన్‌వాడీ భవనాల నిర్మాణానికి నిధులు మం జూరు చేయిస్తానని, వాటికి స్థలాలను గుర్తిం చాలని తహసీల్దార్‌ను ఆదేశించారు. వెలుగొం డ ప్రాజెక్టు పనులు త్వరతిగతిన పూర్తి చేసేందుకు అందుకు నిధులు అధికంగా కేటాయించేలా సీఎం చంద్రబాబు నాయుడు వద్ద హా మీ పొందడటం జరిగిందని, మొదటి దశలో నీటి సరఫరా చేసేలా చర్యలు తీసుకోవాలని సీఎంను కోరినట్లు చెప్పారు.
అలాగే డీజీపేట ఆర్‌అండ్‌బీ రోడ్డు నుంచి అరివేముల లింకురోడ్డు వరకు తారురోడ్డు ని ర్మాణానికి రూ.65లక్షల నిధులు మంజూరు చే యించామని ఎమ్మెల్యే వెల్లడించారు. అనంత రం కదిరిని అధికారులు, ప్రజాప్రతినిధులు ఘనంగా సన్మానించారు. ఈ సమావేశంలో తహసీల్దార్‌ మల్లికార్జునప్రసాదు, ఎంపీడీవో రా జేందర్‌, జడ్పీటీసీ ఎం.డేవిడ్‌, వైస్‌ ఎంపీపీ బి.రాజేశ్వరీ, పంచాయతీ రాజ్‌ డీఈ చెంచురామయ్య, ఎంఈవో కె.నారాయణ, పలు శాఖల ఏఈఈలు మస్తాన్‌బాషా, జె.పవన్‌కుమార్‌, శ్రీరాములు, రాజశేఖర్‌, పశువైద్యాధికారులు షేక్‌ మునీర్‌, జి.వెంకటేశ్వర్లు, ఐకేపీ ఏపీఎం ఎం.భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.