desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 14 2014 @ 02:41AM

తాగునీటి కోసం తంటాలు

పలుకాలనీల్లో నీటి సరఫరాకు అంతరాయం ఫ ఇబ్బందిపడుతున్న నగరవాసులు
ఒంగోలు కార్పొరేషన్‌: ఒంగోలు నగరంలో నీటి సరఫరా విధానం అస్తవ్యస్తంగా ఉంది. సిబ్బంది నిర్లక్ష్యం వక్షౌ ప్రజలు గుక్కెడు నీటి కోసం వేయి కళ్ళతో ఎదురు చూడాల్సిన పరి స్థితి నెలకొంది. ఒకవైపు ప్రజల తాగునీటి అ వసరాలు తీర్చడం కోసం ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతుందనీ హామీలు గుప్పిస్తుం డగా ఆచరణలో సాధ్యపడటం లేదు. ప్రజాప్ర తినిధుల పర్యవేక్షణా లోపమో, అధికారుల అ లసత్వమో, క్షేత్రస్థాయి సిబ్బంది నిర్లక్ష్యమో అ ర్ధం కాని పరిస్థితి ప్రజల్లో నెలకొంది. గడిచిన రెండు, మూడు నెలల వరకు వేసవి చెరు వులు ఎండిపోగా, వారం రోజుల కొకసారి కూ డా తాగునీరు అందించలేదు. కాగా ప్రస్తుతం వేసవిచెరువుల నిండా నీళ్ళు తొణికిసలాడు తున్నాయి. కానీ కొళాయిలకు చేరడం లేదు. ఇప్పటికీ గత నాలుగు రోజులుగా నగరంలో తాగునీటి సరఫరాలో సమస్య తలెత్తింది. పలు కాలనీలకు నీటి సరఫరా నిలిచిపోయింది. కానీ ఆ విషయాన్ని అధికారులు నగర ప్రజల కు సమాచారం అందించలేదు. దీంతో రోజు మాదిరిగానే ప్రజలు తాగునీటి కోసం గంటల తరబడి ఎదురు చూడాల్సి వచ్చింది. ఏళ్ళు గడుస్తున్నా, హోదాలు మారుతున్న అర్ధరాత్రి నీటి సరఫరా విధానం మారడం లేదు. ఎప్పు డొస్తాయో తెలియదు. ఎంత సేపు ఇస్తారో తె లియని నీటిసరఫరాపై శనివారం కొంతమం ది కార్పొరేషన్‌ ఇంజనీరింగ్‌ అధికారులను ప్ర శ్నించడంతో పైపులైను మరమ్మతులకు గురై నట్లు తాపీగా వెల్లడించారు. కనీసం ఎప్పుటికి పూర్తవుతాయో చెప్పడం లేదు. సమస్యను ఎ న్నిసార్లు, ఎంతమంది ఉన్నతాధికారులకు, ప్ర జాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్ళిని పట్టించుకునే నాధుడు లేడని పలువురు వాపోతున్నారు. శా ఖపరమైన చర్యలు తీసుకోకపోవడంపై స ర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఇప్పటికైనా సంబంధిత అధికారులు సపందించి తాగునీటి సమస్యకు లేకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.