Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 14 2014 @ 02:40AM

కుంటుపడిన పాలన...పేరుకుపోయిన దసా్త్రలు


మార్కాపురం: డివిజన్‌లోని అన్ని మండలాల్లో గత కొంత కాలంగా పాలన కుంటుపడుతోంది. అధికారుల్లో బదిలీల ప్రభావం పడటంతో అన్ని శాఖల్లోని అధికారుల్లో స్థబ్దత నెలకొంది. రాజకీయ నాయకులు మండలాల వారీగా తమకు అనుకూలమైన అధికారులను నియమించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. దీనితో మండల స్థాయి నుంచి కింది స్థాయి సిబ్బంది వరకూ రాజకీయ నాయకుల ను ప్రసన్నం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. దీనితో ఆ శాఖల్లో ప్రభుత్వ పథకాల అమలు నామమాత్రంగా కొనసాగుతోంది. ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరుగుతూ అధి కారులు అందుబాటులో లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారు. రెండు నెలలుగా ఈ రోజు రేపంటూ అధికారుల బదిలీల పై పుకార్లు షికార్లు చేస్తుండటంతో అధికారు ల్లో రోజురోజుకు ఉత్కంఠత నెలకొంది. ఈ సందిగ్ధంలో అధికారులు ఫైళ్ళ జోలికి పోక పోవడంతో కుప్పలు తెప్పలుగా మిగిలి పోతున్నా యి. బదిలీపై పోవడం ఖాయమనుకుంటున్న అధికారులు పాలనపై దృష్టిసారించటం లేదు. ఇటీవల బదిలీలపై వచ్చిన మండల స్థాయి అధికారులకు అటు రాజకీయ నాయకులు, ఉన్నతాధికారుల ఒత్తిడి పెరగడంతో ఎటూ తేల్చుకోలేక కొట్టుమిట్టాడుతున్నారు. పాత పద్ధతులకే అలవాటు పడ్డ కింది స్థాయి సిబ్బంది కొత్తగా వచ్చిన అధికారులకు సహకరించకపోవడంతో తమను తెచ్చుకున్న రాజకీ య నాయకుల పనులు కూడా చేయలేక సతమతం అవుతున్నారు. ఈ క్రమంలో ప్రజలు రోజుల తరబడి కార్యాలయాల చుట్టూ తిరుగుతూ అధికారులను ప్రసన్నం చేసుకుంటున్పప్పటికీ సకాలంలో స్పందించకపోవడంతో దిక్కు తోచని పరిస్థితుల్లో రాజకీయ నాయకులను ఆశ్రయిస్తున్నారు. దీనితో ప్రతి చిన్న పనికి అధికారులపై రాజకీయ నాయకుల సిఫార్సులు చేయవలసి రావడంతో వారికి తలనొప్పిని తెచ్చిపెడుతున్నాయి.