Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 14 2014 @ 02:39AM

రుణమాఫీకి అర్హుల వివరాలను


రేపటి లోపు అందజేయాలి : ఏపీజీబీ ఆర్‌ఎం ప్రసాద్‌
కారంచేడు : రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రుణమాఫీ పథకానికి సం బంధించి అర్హత కలిగిన ఖతాదారులు తమ వివరాలు ఈ నెల 15వ తేది లోపు సేకరించి వివేదికలు వెంటనే పంపాలని ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాం కు (ఏపీజీబీ) రీజనల్‌ మేనేజర్‌ వి.సి.కె.ప్రసాద్‌ అన్నారు. ఖాతాదారులకు సంబంధించిన ఆధార్‌, రేషన్‌కార్డు,ప్టాదారు పాస్‌పుస్తకాలు తదితర వివరాలన్నీ శాఖాధికారులు మేరకు తీసుకున్నారో తెలుసుకునేందుకు ఆయన శనివారం కారంచేడు వచ్చారు. స్థానిక అధికారుల సిబ్బందితో మాట్లాడిన అనంతరం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మా ట్లాడారు. ప్రతి కుటుంబంలో బ్యాంకు ఖాతాలేని సభ్యులందరూ జనధన్‌ యోజన పథకం కింద జీరో బ్యాలన్స్‌తో ఖాతాలు ప్రారంభిస్తామని ఈ అవకాశం జనవరి 25 వరకు ఉంటుందని తెలిపారు. కారంచేడు శాఖలో ప్రస్తుతానికి 400 ఖాతాలు జీరో బ్యాలన్స్‌తో ప్రారంంభించామన్నారు. శాఖాధికారి ఎన్‌.రామమోహనరావు, ఎబీఎం ఎస్‌.వాసుదేవరావు పాల్గొన్నారు.