Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 14 2014 @ 02:39AM

మద్యం దుకాణాల మార్పు వివాదాస్పదం


4 నిబంధనలు తుంగలో తొక్కిన ఎక్సైజ్‌ 4 కోర్టుల చుట్టూ అధికారుల ప్రదక్షిణలు
ఒంగోలు క్రైం: జిల్లాలో మ ద్యం దుకా ణాలు తరలింపు విషయం వివాదాస్పదంగా మారింది. అధికార్ల ప్రాపకోసం చేసిన ప్రతిపాదనలు ఎక్సైజ్‌ శాఖకు గుదిబండగా మా రింది. నగరంలో అద్దంకి బస్టాండ్‌ వద్ద ఏర్పాటు చేసేందుకు ఎక్సైజ్‌ ఆధికార్లు చూపించిన అతి ఉత్సాహం ఆశాఖ అధికార్లకు తలనొప్పిగా పరిణ మించింది. నిబంధనలకు విరుద్ధంగా అధికార్లు తీసుకున్న నిర్ణయం గుది బండగా మారింది. టంగుటూరు మండలంలో ఉన్న వల్లూరు-2 మద్యం దు కాణ యజమాని అధికార్లకు విన్నవిం చుకు న్నాడు. ఓ ప్రజాప్రతినిధి అండదండలతో ఎక్సయిజ్‌ అధికారులపై ఒత్తిడి తెచ్చారు. దీంతో ఆ ప్రజాప్రతినిఽధి ప్రాపకం కోసం ఎక్స యిజ్‌ అధికార్లు నిబంధనలను తుంగలో తొక్కారు. అగమేఘాల మీద వల్లూరు-2 దుకాణాన్ని నగరం లోని అద్దంకి బస్టాండ్‌కు మార్చేం దుకు ప్రతిపాదనలు తయారు చేశారు. జిల్లా ఆధికారులు ఆ ఫైల్‌ను పరు గులు తీయించి హైదరాబాద్‌ కమిషనర్‌ కా ర్యాలయానికి పంపించారు. మరో ప్రజా ప్రతి నిధి ఆ విషయంలో కలుగ జేసుకుని ప్రస్తు తం మద్యం దుకాణం తరలింపు నిలిపి వే యాలని ఆధికార్లకు మౌఖిక అదేశాలు జారీ చేశారు. దీంతో ఎక్సైజ్‌ అధికార్లు నోట్లో పచ్చి వెలక్కాయ పడ్డట్లయింది. అదే సమయంలో అద్దంకి బస్టాండ్‌లో మద్యం దుకాణం నడుపు తున్న యజమాని కోర్టుకు ఆశ్రయించారు. నిబంధనలకు విరుద్ధంగా మ ద్యం దుకాణం తరలింపు ప్రస్తుతానికి నిలపి వేయాలని ఆదేశాలు అందాయి. నాలుగు వారాల్లోపు ఈ విషయంపై ఎక్సైజ్‌ అధి కార్లు వివరణ కోర్టుకు సమర్పిం చాలని ఆదేశాలు ఇచ్చాయి.
మర్రిచెట్లపాలెం దుకాణం
మార్పుపై కోర్టుకు
చీమకుర్తి మండలంలో మర్రి చెట్లపాలెం వద్ద మద్యం దుకాణానికి డిమాండ్‌ వచ్చిం ది. ఆదే సమయంలో ఆధికార్లు అనాలోచిత నిర్ణయంతో రామతీర్ధంలో ఉన్న మద్యం దుకా ణాన్ని బూదవాడకు తరలిం చారు. ఒకే పం చాయతీలో అతి తక్కువ జనాభా గల గ్రా మంలో రెండో దుకాణం పెట్టడం మొదటి నోటిఫికేషన్‌లో లేకుండా రీలొకేషన్‌ పేరుతో తర లించడంపై కోర్టును ఆశ్రయించారు. ఎక్సైజ్‌ అధికార్ల నిర్ణయాన్ని కోర్టు తప్పు పట్టింది. నిబంధనలకు విరు ద్ధంగా ఒత్తిళ్లకు తలొగ్గి అనాలోచిత నిర్ణయాలు తీసుకున్న ఆధికార్లు ఎక్సైజ్‌ శాఖ మొత్తానికి తలనొప్పిగా మారాయి. దాంతో ఉన్నతాధికార్లు కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తోంది.