Server-91
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 14 2014 @ 02:39AM

ఈ-పేమెంట్స్‌ విధానాన్ని దశల వారీగా ప్రారంభించాలి

పేమెంట్స్‌పై ఉద్యోగులకు శిక్షణ ఇవ్వాలి ట ట్రెజరీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజ్‌కుమార్‌
ఒంగోలు కలెక్టరేట్‌: ట్రెజరీ శాఖలో రాష్ట్ర వ్యాప్తంగా ఈపేమెంట్స్‌ విధానాన్ని ప్రవేశపెట్టడంతో ట్రెజరీ ఉద్యోగులు మానసిక క్షోభకు గురికా వాల్సి వస్తోందని ఎపి ట్రెజరీ అసోసి యేషన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఖాజా రాజ్‌కుమార్‌ అన్నారు. ఒం గోలులోని అసోసియేషన్‌ కార్యాల యంలో శనివారం విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ-పేమెంట్స్‌ విధానాన్ని పైలెట్‌ ప్రాజెక్టుగా తీసుకుని అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. ఒకే సారి రాష్ట్ర వ్యాప్తంగా ఈ-పేమెంట్స్‌ విధానాన్ని ప్రవేశపెట్టడం వల్ల సకాలంలో ఉద్యోగులకు వేతనాలు చెల్లించలేని పరిస్థితి ఏర్పడింద న్నారు. దీని కారణంగా ట్రెజరీ ఉద్యో గులు ఒత్తిడికి గురికావాల్సి వస్తోం దని, ప్రభుత్వం ఈవిషయంపై ప్ర త్యేక చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ-పేమెంట్స్‌ విధానంపై పైలెట్‌ ప్రాజెక్టు కింద ఎంపిక చేసినజిల్లాలో ముందుగా ప్రారంభించి తదనంతర కాలంలో ఇతర జిల్లాలకు విస్తరింప జేయడం ద్వారా ఉద్యోగులపై ఒత్తి డి తగ్గుతుందని చెప్పారు. ప్రభుత్వం నూతన టెక్నాలజీని వినియోగంలోకి తేవడం శుభపరిణామమన్నారు. అందుకు తగినవిధంగా ట్రెజరీ ఉద్యో గులకు శిక్షణ ఇవ్వాలని కోరారు. గత ప్రభుత్వ హయంలో 433 సీనియర్‌, జూనియర్‌ అకౌంటెంట్స్‌, ఎస్‌టిఓ, ఎటిఓ, అసిస్టెంట్‌ డైరెక్టర్‌ పోస్టులను కొత్తగా మంజూరు చేసినా ఇంత వ రకు ఆ పోస్టులను భర్తీ చేయలే దన్నారు. సిబ్బంది కొరత కారణంగా కూడా ఈ-పేమెంట్స్‌ విధానంలో ఇ బ్బందులు వస్తున్నాయని, ప్రభుత్వం ఈ విషయంపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరారు. మరో వైపు ట్రెజరీ, బ్యాంకుల సర్వర్లు డౌన్‌ (తగ్గి పోవడం) కావడం వల్ల కూడా పే మెంట్‌ల చెల్లింపుల్లో ఇబ్బందులు జరుగుతున్నాయని అన్నారు. ప్రభు త్వం ఈ విషయంపై ప్రత్యేక చొరవ తీసుకోవాలని కోరారు. ఆదివారం ఒంగోలులో ఏపీ ట్రెజరీ అసోసి యే షన్‌ ఎన్నికలు జరుగుతున్నాయని, ఆ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగే విధంగా ప్రతి ఒక్క ట్రెజరీ ఉద్యోగి సహకరించాలని కోరారు. పోటీతత్వం లేకుండా ఏకగ్రీవంగా ఎ న్నికలు జరిగితే ఉద్యోగుల సమస్య లను పరిష్కరించేందుకు సాధ్యప డుతుందని అన్నారు. ఆదివారం జరిగే అసోసియేషన్‌ జిల్లా ఎన్నికల్లో ప్రతి ఒక్క ఉద్యోగి పాల్గొని విజయ వంతం చేయాలని కోరారు. విలేఖ రుల సమావేశంలో అసోసియేషన్‌ నాయకులు ఆహ్మద్‌, వెంకటస్వామి, సిహెచ్‌ కమలాకర్‌, ఎం.వి.రెడ్డి, కరీముల్లా, పివి నారాయణ, అజయ్‌, సంపత్‌, ఆనంద్‌బాబు, ఎస్‌కె అబ్దుల్‌ ఖాదర్‌, ఎటిఓలు కనకరాజు, శ్రీనివా సరావు తదితరులు పాల్గొన్నారు.