Server-91
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 14 2014 @ 02:38AM

చక్కెర ఫ్యాక్టరీ కోసం ఎదురుచూపు

గుంటిగంగ ప్రాంతం అనుకూలం ఝ దశాబ్దాలుగా నోచుకోని వైనం ఝ అధిక విస్తీర్ణంలో సాగవుతున్న చెరుకు ఝ ఎగుమతికి అవకాశాలు లేక రైతుల ఇబ్బందులు
అద్దంకి: దశాబ్దల నుంచి చక్కెర ప్యాక్టరీ కోసం తాళ్లూరు ప్రాంత ప్రజలు ఎదురు చూడ డం తో సరిపోతోంది. తాళ్ళూరు మం డలంలో దశాబ్దల నుంచి చెరకు పంట సాగు చేస్తున్నారు. చీమకుర్తి, అద్దంకి, ముండ్లమూరు, బల్లికురవ, యర్రగొండపాలెం తదితర మండలాలలో పలు గ్రామాలలో చెరుకు తోటలు పెద్ద ఎత్తున సాగు చేస్తున్నారు. తాళ్ళూరు మండలంలో గతంలో కంటే కొంత మేర సాగు విస్తీర్ణం తగ్గినప్పటికి ప్రస్తు తం 800 ఎక రాలలో సాగు చేస్తున్నారు. మిగిలిన చోట్ల కూడా సాగు విస్తీర్ణం బాగానే ఉంది. ప్రకాశం, గుంటూరు జిల్లాలలో చక్కెర ప్యాక్టరీలు లేక పోవడంతో సుదూర ప్రాంతాలకు రవాణా చేయలేక బెల్లం తయారీ చేస్తున్నారు. బెల్లం ధర అనుకూలంగా ఉన్న సమయంలో లాభాలు వస్తుండగా మరికొన్ని సందర్భాలలో నష్టాలను చవిచూడాల్సి వస్తుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. సు మారు రెండు దశాబ్దాల క్రితమే గుంటిగంగ ప్రాంతంలో చక్కెర ప్యాక్టరీని నిర్మించనున్నట్లు ప్రచారం జరిగింది. అది కార్యరూపం దాల్చలేదు. గుంటిగంగ వద్ద అటవీ భూమి నిరుపయోగంగా ఉంది. వృక్షసంపద కూడా పెద్దగా లేదు. చక్కెర ప్యాక్టరీ నిర్మాణానికి అవసరమైన భూమి అందుబాటులో ఉంది. తాళ్ళూరు మండలంలో చెరకు సాగు చేస్తున్న నాగంబొట్లపాలెం, రామభద్రాపురం, తూర్పుగంగవరం, శివరామపురం, చీమకుర్తి మండలం పాటిమీదపాలెం తదితర గ్రా మాలు గుంటిగంగకు అతి సమీపంలో ఉన్నాయి. భూగర్భ జలాలు సమృద్ధిగా ఉండటంతో ఏడాది పొడవున సాగుకు ఢోకా కూడా లేదు. నవ్యాంధ్ర ప్రదేశ్‌ను అభివృద్ధిపథంలో నడిపించేందుకు ఫ్యాక్టరీల ఏర్పాటుకు ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందిం చేందుకు సంసిద్ధంగా ఉండటంతో గుంటిగంగ ప్రాంతంలో చక్కెర ప్యాక్టరీ ఏర్పాటుకు ప్రజా ప్రతినిధులు ప్రత్యేక దృష్టి సారించాలని రైతులు కోరుతున్నారు. ప్యాక్టరీ ఏర్పాటు జరిగితే సాగు విస్తీర్ణం కూడా మరింత పెరిగే అవకాశం ఉంది. రైతులు ఆర్థికంగా మరింత స్థిరపడే అవకాశం కూడా ఉంది. కార్మికులకు ఉపాధి అవకాశాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. మంత్రి శిద్దా రాఘవరావు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం పరిధి కావటంతో ఒకింత దృష్టి సారిస్తే చక్కెర ప్యాక్టరీ ఏర్పాటు కు పారి శ్రామిక వేత్తలు ముందుకు వచ్చే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.