Server-91
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 14 2014 @ 02:38AM

వ్యవసాయంలో మహిళా శక్తి

అన్ని పనుల్లో భాగస్వామ్యం
పెద్దదోర్నాల: వ్యవసాయంలో మహిళల పాత్ర రోజురోజుకూ పెరుగుతోంది. పురుష రైతుల కన్నా మహిళలు లేనిది వ్యవసాయ పనులు తమ వల్ల కాదన్న భావన్న వ్యక్తమవుతోంది. ప్రధానంగా వ్యవసాయంలో తమదైన పాత్ర అపారం. స్ర్తీ భాగస్వామ్యం లేకుండా సేద్యం సాధ్యం కాదన్నంతగా మహిళలు కష్టిస్తున్నారు. వ్యవసాయంలో మహిళ లు లేకుంటే చిన్న పని కూడా ముందుకు సాగటం లేదు. విత్తనం నాటింది మొదలు కలుపు తీతలు, మందు పిచికారి, పంటల శీతలు, ఆరబోతలు నూర్పిళ్ళ వరకు అంతా మహిళలదే. మహిళలదే ప్రథమ స్థానం అనడంలో అతిశయోక్తి లేదు. అయి నా వారికి పురుషులు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వటం లేదు. కేవలం కూలీలుగానే పరిగణిస్తున్నారు. అ రక దున్నటం, నీటితడులు ఇవ్వటంతోనే యజమానిగా భావిస్తున్నాడు. అవసరమైన చోట ఆ రెండు పనులు చేయగలరు. భూమికి సంబంధిం చినంత వరకు మహిళలదే పై చేయిగా చెప్పుకోవచ్చు. భూమిని సామాజిక అంశంగా పరిగణిస్తే అదే భూమిపై మహిళలకు పూర్తి హక్కులు కేటాయించటం లేదు. అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో స్వర్గీయ నందమూరి తారకరాౄమారావు ఆస్తిలో మగవారికి సమానంగా ఆస్థి హక్కులు కల్పించారు.
అయినా ఆచరణ రూపంలో తల్లిదండ్రులు అందుకు ఇష్టపడటం లేదు. వ్యవసాయంలో ప్రత్యక్షంగాను, పరోక్షంగాను ఎక్కువగా కష్టపడేది మహిళలే. ప్రభుత్వం గుర్తించి 2005లో సామాజిక హక్కు గా చట్టం చేశారు. కాగా పురుషుల ఆధిపత్యంతో స్ర్తీలు ఆ హక్కును కోల్పోయా రు. ఇప్పడిప్పుడే రాజకీయంగాను, ఉద్యోగాలలో కల్పించిన రిజర్వేషన్‌ పరంగా చైతన్యవంతులైన మహిళలు తమ హక్కు లు సాధించుకునేందుకు ఇంకా ముందడుగు వేయాల్సి ఉంది.